13 year old girl thrown into ganga by parents

13-year-old girl thrown into Ganga by parents,Ganga, girl thrown in river, Haridwar, Uttarakhand,Uttar Pradesh, girl thrown into Ganga by parents, Ganga Haridwar

13-year-old girl thrown into Ganga by parents

Ganga.gif

Posted: 08/04/2012 12:32 PM IST
13 year old girl thrown into ganga by parents

13-year-old girl thrown into Ganga by parents

డబ్బులు లేక కన్న పిల్లలను అమ్ముకునే తల్లిదండ్రులను చూసాం గానీ .. తమ సుఖలకు అడ్డుగా ఉందని కన్న కూతురిని నదిలోకి తోసేసిన తల్లిదండ్రులు ఉన్నారనే విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి కర్కశం ఎలా ఉంటుందో మరోసారి  రుజువైంది.  మా అమ్మా, నాన్న నన్ను చంపేయబోయారు. ఇందుకు పథకం పన్ని నన్ను గంగా నదిలో తోసేశారు' అంటూ ఓ 13 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు స్వయంగా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీమా కుమారి తన తండ్రి, సవతి తల్లితో కలిసి రక్షా బంధన్ వేడుకల కోసం హరిద్వార్ వచ్చింది. గంగానది వెంట వెళ్తుండగా తల్లిదండ్రులిద్దరూ కలిసి సీమను అందులోకి నెట్టేశారు. లోతైన నీళ్లలో పడిన సీమ చచ్చిపోయిందని భావించి వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, స్థానికుల సహకారంతో ప్రాణాలు దక్కించుకున్న సీమ ఆ రాత్రికి అక్కడే ఒక సాధువు వద్ద ఆశ్రయం పొందింది. స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనపై తల్లిదండ్రులే హత్యాయత్నం చేశారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీమ అమ్మా, నాన్నపై కేసు నమోదు చేసి వారి కోసం వెదుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake doctors held in salem namakkal
Loss of rs100 note causes four deaths in uttar pradesh village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles