కొద్దిరోజుల్లో భర్తతో కలిసి విదేశాలకు ప్రయాణం కావాలనుకుంది. ఎంతో సంతోషంతో షాపింగ్ చేసింది. విమాన టికెట్లనూ సిద్ధం చేసుకుంది. పుట్టింటి వారితో సహా బంధువులందరికీ ఈ విషయాన్ని చెప్పింది. ఇంతలోనే తీరని విషాదం చోటుచేసుకుంది. పనిచేస్తున్న భవనం పైనుంచి కింద పడి మరణించింది. ఇన్ఫోసిస్ ఉద్యోగిని అయిన ఆమె మృతి మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకుందని కంపెనీ వర్గాలు చెబుతుండగా, ముమ్మాటికీ తమ కుమార్తెది హత్యేనంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన తీరు, పరిస్థితులను పరిశీలిస్తే హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ నిర్వాహకులు తమకున్న పలుకుబడితో కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు అపోలో ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆసుపత్రి వైద్యుల తీరును వారు తప్పుబడుతున్నారు. అనేక అనుమానాలకు తావిస్తోన్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనకు కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో భర్త సుధాకర్‌రెడ్డికి చెప్పి నీలిమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కంపెనీ నిర్వాహకులు సుధాకర్‌రెడ్డికిఫోన్ చేసి నీలిమ భవనం పదో అంతస్థు పైనుంచి కిందపడిందని, తీవ్రమైన గాయాలయ్యాయని, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. సుధాకర్ తన అత్త, ఆమె బంధువులతో కలిసి బుధవారం తెల్లవారుజామున అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. నీలిమ మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో వారంతా కుప్పకూలిపోయారు.
తెల్లవారుజామున 4 గంటలకే నీలిమ బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారికి నీలిమ మృతదేహాన్ని చూపించడంలో ఆస్పత్రి సిబ్బంది ఆలస్యం చేశారు. ఆగ్రహానికి గురైన నీలిమ తల్లి రాణి, భర్త సుధాకర్‌రెడ్డితో పాటు బంధువులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు చేరుకుంది. చివరకు బంజారాహిల్స్ పోలీసులు కలుగజేసుకొని బంధువులకు నీలిమ మృతదేహాన్ని చూపించారు. నిర్జీవంగా ఉన్న ఆమెను చూసిన బంధువులు భోరున విలపించారు. ముఖం, చేతితో పాటు పలు చోట్ల గాయాలు ఉండటంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమార్తెది హత్యేనంటూ మృతురాలి తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ఫోసిస్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. సంస్థ నిర్వాహకులను సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ప్రేక్షకపాత్ర వహించారు. అనుమానాలెన్నో? నీలిమ మృతి వెనుక అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎ సంస్థ సిబ్బంది 10వ అంతస్థు అని చెబుతుండగా, పోలీసులు మాత్రం ఏడో అంతస్థని చెబుతున్నారు. ఆమె బ్యాగు తొమ్మిదో అంతస్థులో, చెప్పులు ఏడో అంతస్థులో లభ్యమయ్యాయి. సంస్థ సిబ్బంది కూడా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 10.25 గంటలకు ప్రమాదం జరిగితే కుటుంబీకులకు వెంటనే ఎందుకు తెలియపరచలేదు? అంత పైనుంచి కిందపడితే తీవ్రమైన గాయాలు ఎందుకు కాలేదు? రక్తస్రావం జరగకపోవడమే కాకుండా, శరీరంలో ఎముకలు కూడా విరగలేదు.
కేవలం ముఖంపైనే చిన్న గాట్లు ఎందుకు అయ్యాయి? ఆమె కంపెనీకి 9.30 గంటలకు చేరుకోగా 10.25 గంటలకు కింద పడింది. ఈ మధ్యకాలంలో లోపల ఏం జరిగింది? కారు తీసుకువెళ్లని నీలిమ ప్రధాన భవనంలోకి వెళ్లకుండా పార్కింగ్ భవనం వద్దకు ఎందుకు వెళ్లింది? మల్టీలెవల్ పార్కింగ్ (ఎంఎల్‌పి) బిల్డింగ్‌లో ఏం జరిగింది? నీలిమ మృతదేహంపై అనేక చోట్ల గోళ్లతో రక్కినట్టు గుర్తులు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. పైనుంచి కింద పడితే శరీరంపై గోళ్ల గీతలు ఎలా పడ్డాయి? గత వారం మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువతి మూడో అంతస్థు నుంచి కిందకు దూకడంతో ఆమె శరీరం గుర్తు పట్టలేని విధంగా మారింది. నీలిమ పరిస్థితి అలా లేదు. కేవలం ముఖాన్ని నేలకు అదిమిపడితే అయ్యే గాయాలే కనిపిస్తున్నాయి. అంతకు మించి తలపై ఎలాంటి గాయాల్లేవు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more