Kampli mla suresh babu arrested

Suresh Babu,Karnataka MLA,CBI,acb

Anti-Corruption Bureau (ACB) sleuths on Monday night arrested Karnataka MLA T H Suresh Babu from the city

Kampli MLA Suresh Babu arrested.png

Posted: 07/31/2012 11:14 AM IST
Kampli mla suresh babu arrested

MLA-Suresh-babuఅక్రమ గనుల ఘనుడు గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసులో కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. గతంలో ఈ కేసులో జడ్జిలు అరెస్టయిన విషయం తెలిసిందే.  ఈ కేసులో ఎమ్మెల్యే హస్తం ఉందని తెలుసుకున్న ఎసిబి అధికారులు  ఆయన కోసం తీవ్రంగా గాలిస్తుంది.. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కోర్టులో లొంగిపోతానంటూ తన న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడుతుండగా సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఏసీబీ అధికారులు ఆయన్ను గుర్తించి అరెస్టు చేశారు. నోటీసుల గడువు ఈ నెల 29కి పూర్తి కావడంతో 30న సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో లొంగిపోయేందుకు బళ్లారి ఎంపీ శాంత, రాయచూరు ఎంపీ సన్న పక్కీరప్పతో కలిసి సురేష్‌బాబు ఏసీబీ కోర్టు సమీపానికి వచ్చారు.

అప్పటికే విషయం తెలియడంతో కోర్టుకు కొద్దిదూరంలో కాపు వేసిన తమ అధికారులు సురేష్‌బాబును అరెరస్టు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ బి.ప్రసాదరావు తెలిపారు. ఆయనను ఎంజేమార్కెట్ సమీపంలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఎమ్మెల్యే సురేష్‌ను ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నట్లు  ఏసీబీ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One year jail for gudiwada mla kodali nani
Bharath in olympic games  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles