Government super bazars

government super bazars

government super bazars

27.gif

Posted: 07/28/2012 03:24 PM IST
Government super bazars

       ఎప్పటినుంచో ఊరిస్తున్న సర్కారీ సూపర్‌బజార్లు త్వరలోనే రానున్నాయి. కేరళ తరహాలో వీటిని ఏర్పాటు చేసి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిపై అధ్యయ నం సాగుతున్నదని, నివేదిక అందగానే ఈ ప్రక్రియ మొదలు పెడతామని చెప్పారు. ఆధార్ ఉంటేనే రేషన్ పంపిణీ అనేది తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా డీలర్లు ఇలా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. బోగస్ కార్డులను స్వచ్ఛందంగా స్వాధీనం చేయాలని రేషన్ డీలర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామని.. ఆగస్టు 15 వరకూ దీనికి గడువు ఇచ్చామని వివరించారు.  బోగస్‌కార్డులపై ఎవరైనా సమాచారమిస్తే వారికి పారితోషికం ఇస్తామన్నారు. sr
       ధనిక వర్గాలకు వంటగ్యాస్ సబ్సిడీ ఎత్తేయాలని కేంద్రం నిర్ణయించిందని.. ఆ ప్రకారం ప్రతి సిలెండర్‌పై రాష్ట్రం భరించే రూ.25 కూడా తీసేస్తామని ఆయన చెప్పారు. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ. 261 సబ్సిడీ భరిస్తోందని, ధనికవర్గాలకు ఈ సబ్సిడీని రద్దు చేయడం వల్ల పేదలకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. నగదు బదిలీ పథకాన్ని తొలుత మూడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. కిరోసిన్‌పై కేంద్రం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ పథకంలో భాగంగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారని వివరించారు. సెప్టెంబర్ నుంచి దీనిని అమలు చేస్తామన్నారు. ఆధార్ జారీ ప్రక్రియ తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తికావాల్సి ఉందని.. అయితే ఇందులో జరిగిన ఆలస్యం వల్ల ఇంకో ఏడాదిన్నర పట్టే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, కిరోసిన్, వంటగ్యాస్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ. 10 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నాయని చెప్పారు. బియ్యం సేకరణకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని, దీనివల్ల బియ్యం ధరలు కూడా తగ్గడంతో పాటు నాణ్యమైన బియ్యం మనకే ఉంటాయని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో ధాన్యా న్ని సేకరిస్తామని, ఇందుకోసం కేంద్రం అనుమతి కోరుతున్నామని చెప్పారు. నెల్లూరు సన్నాల సాగును మరింత ప్రోత్సహిస్తామని, ఈ దిశగా రైతులకు కనీస మద్దతు ధర రూ.1280కి రూ.220 బోనస్ కలిపి రూ.1500 చెల్లిస్తామని వివరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly website
Chiranjeevi appeal to governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles