Muthyam stone

muthyam ston,cancer, treatment,

muthyam stone

muthyam.gif

Posted: 07/21/2012 11:27 AM IST
Muthyam stone

muthyam stone

ఆభరణాల్లో ఒదిగిపోయి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముత్యాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయట! ముత్యాలతో కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని పెర్ల్ అ క్వాకల్చర్ రీసెర్చ్ ఫౌండేషన్ దీనిపై అధ్యయనం చేస్తోంది. ప్రత్యేక పద్ధతుల ద్వారా ఇక్కడి ప్రయోగశాలలో కొన్ని రకాల ముత్యాలను పరిశోధకులు తయారుచేశారు.వాటి లో ఉండే ఖనిజాలు, లోహాల వల్ల వైద్యపరంగా అనేక లా భాలున్నాయని పరిశోధన బృంద సభ్యుడు అజయ్‌కుమా ర్ సోంకార్ తెలిపారు. ముత్యాల్లో జింక్, కాపర్, మెగ్నీషి యం, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి వి ఉంటాయని, జీవ ప్రక్రియలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. జింక్‌తో కేన్సర్ కణతులను అరికట్టవచ్చని ఇదివరకే పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. తాము అభివృద్ధి పరిచిన ముత్యాల పొడి ని వైద్య పరిశోధనల కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయన సంస్థలకు పంపించామని, వాటి సాయంతో విస్తృత అధ్యయనా న్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు సోంకార్ వెల్లడించారు. ముత్యాల్లోని ముడి పదార్థాలతో తీవ్ర జబ్బులను నయం చేసే అవకాశం ఉందని, ఆ మార్గాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police dogs given head cameras to film criminals
Hindu goddess kali mata used as a combat porn star  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles