Pc may head gom on telecom spectrum

PC may head GoM on telecom spectrum, Chidambaram back in spectrum as telecom GoM head

PC may head GoM on telecom spectrum

spectrum.gif

Posted: 07/07/2012 01:51 PM IST
Pc may head gom on telecom spectrum

PC may head GoM on telecom spectrum

స్పెక్ట్రమ్ కేటాయింపులపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం సారథ్యం వహించనున్నారు. మంత్రుల బృంద సారథ్య బాధ్యతలనుంచి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రాజీనామా చేయడంతో మంత్రుల కమిటీని శుక్రవారం పునర్ వ్యవస్థీకరించారు. కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యేదీ ప్రకటించకపోయినా, జాబితాలో చిదంబరం పేరు అగ్రస్థానంలో ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల కమిటీ జాబితాలో సభ్యుడిగా కూడా శరద్ పవార్ పేరు లేకపోవడం గమనార్హం. తరచూ తనను వివాదాల్లోకి లాగుతున్నారనే ఆరోపణతో చైర్మన్ పదవికి శరద్‌పవార్ రాజీనామా చేసిన విషయం విదితమే. కాగా, పునర్ వ్యవస్థీకరించిన మంత్రుల కమిటీ ఎప్పుడు సమావేశమయ్యేది ఇంతవరకూ ఖరారు కాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పునర్ వ్యవస్థీకరించిన మంత్రుల కమిటీలో రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ, టెలికం మంత్రి కపిల్ సిబాల్, సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అంబికాసోనీ, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సభ్యులుగా కొనసాగనున్నారు.

మంత్రుల కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి అభ్యర్థిగా పోటీచేయనుండటంతో వారం క్రితం ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత పునర్ వ్యవస్థీకరణకు నోచుకున్న మంత్రుల కమిటీకి శరద్‌పవార్‌ను చైర్మన్‌గా నియమించారు. పవార్ నాయకత్వంలో కమిటీ జూలై 2న సమావేశం కావాల్సి వుంది. అయితే, సమావేశాన్ని వాయిదా వేసిన పవార్ ఈలోగానే ప్రధాని మన్మోహన్‌కు రాజీనామా లేఖ సమర్పించడంతో మళ్లీ పునర్ వ్యవస్థీకరించాల్సి వచ్చింది.టెలికాం స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలానికి కనిష్ఠ ధరను నిర్ణయించేందుకు మంత్రుల సాధికార కమిటీని ఏర్పాటుచేశారు. 2008లో అప్పటి టెలికం శాఖ మంత్రి ఎ.రాజా హయాంలో జారీచేసిన 122 లైసెన్సులను గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రద్దుచేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపుల వేలాన్ని ఆగస్టు 31లోగా పూర్తిచేయాలని కూడా అప్పట్లో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm sadananda gowda leaves for delhi
Ysr jayanthi congress high command s crooked politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles