Pranab or sangma for president

Pranab or Sangma for President?,BJP fired a fresh salvo at Pranab Mukherjee, President poll: Disqualify Pranab, demands Sangma

Pranab or Sangma for President?

President.gif

Posted: 07/04/2012 11:24 AM IST
Pranab or sangma for president

Pranab or Sangma for President?

రాష్టప్రతి పదవి కోసం యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ, చీలిక ఎన్డీయే అభ్యర్థి పిఏ సంగ్మా మధ్య ప్రత్యక్ష పోరుకు రంగం సిద్ధమైంది. నామినేషన్ వేసే సమయానికి భారతీయ గణాంక సంస్థ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ప్రణబ్ నామినేషన్ చెల్లదంటూ పిఏ సంగ్మా వర్గం లేవనెత్తిన అభ్యంతరాన్ని రాష్టప్రతి ఎన్నికల నిర్వహణాధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ డాక్టర్ వికె అగ్నిహోత్రి కొట్టివేశారు. ప్రణబ్ ముఖర్జీ, సంగ్మాలపై చరణ్‌లాల్ సాహూ అనే వ్యక్తి దాఖలు చేసిన అభ్యంతరాలనూ తిరస్కరించినట్టు అగ్నిహోత్రి వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ, సంగ్మాల నామినేషన్ పత్రాలు మాత్రమే సక్రమంగా ఉన్నందున వాటినే ఆమోదించినట్టు కూడా అగ్నిహోత్రి ప్రకటించారు. దీంతో రాష్టప్రతి పదవికి ప్రణబ్, సంగ్మాల మధ్య ప్రత్యక్ష పోరు ఖరారైంది. రాష్టప్రతి ఎన్నిక కోసం మొత్తం 106 నామినేషన్లు దాఖలుకాగా, ఇందులో నుంచి 28మంది అభ్యర్థులకు చెందిన 33 నామినేషన్లను నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో తొలిరోజే తిరస్కరించినట్టు అగ్నిహోత్రి వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High court rejects his jagan bail plea
Sonia gandhis mission andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles