ఆదర్శ పాఠశాలల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయాన్ని ప్రకటించింది. పాఠశాలలు ఈ ఏడాది ప్రారంభించాలనుకున్నా ముహూర్తం వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇదే విషయాన్ని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారథి ధృవీకరించారు. రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన 737మండలాల్లో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం గత ఏడాది అనుమతి ఇచ్చింది. మొదటి దశలో దాదాపు పన్నెండువందల కోట్లతో 355 స్కూళ్ల నిర్మాణాలకు, ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఒక్కో స్కూల్ నిర్మాణం, వసతుల కల్పనకు మూడుకోట్ల రెండు లక్షల రూపాయలు కేటాయించింది. అయితే వాటిలో ఒక్క పాఠశాల భవన నిర్మాణం కూడా పూర్తి కాకపోవడంతో ఆదర్శపాఠశాలల ప్రారంభ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ విద్యా సంవత్సరానికిగాను 355మోడల్ స్కూళ్లు ప్రారంభించాల్సి ఉండగా భవనాలు పూర్తి కాలేదని భావించిన విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో కేవలం 132స్కూళ్లలో మాత్రమే 6, 7, 8, 11తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకోసం 40వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గత కొద్దిరోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు వాటి చుట్టూ తిరుగుతున్నారు. ఆదర్శ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ పరీక్ష నిర్వహించడంతో పాఠశాలలు ప్రారంభమౌతాయని భావించినా వారి ఆశ తీరలేదు. అయితే పరీక్ష ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ టీచర్ పోస్టుల్లో మొదట ప్రిన్సిపాళ్ళను తీసుకున్న తర్వాతే మిగతా ఉపాధ్యాయులను తీసుకుంటామని మంత్రి పార్థసారథి అన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more