Baltic sea ufo disables equipments within 200m range

Baltic Sea UFO disables equipments within 200m range,Cryptozoology and UFOs, Baltic Sea, Ocean X team

Baltic Sea UFO disables equipments within 200m range'

Baltic.gif

Posted: 06/28/2012 04:57 PM IST
Baltic sea ufo disables equipments within 200m range

Baltic Sea UFO disables equipments within 200m range'

స్వీడన్ దేశానికి తూర్పు తీరాన.. ఫిన్‌లాండ్ పశ్చిమ తీరాన.. రెండు దేశాలకూ నడిమధ్యన బోత్నియా జలసంధిలో.. బాల్టిక్ సముద్రం అడుగు భా గంలో.. 285 అడుగుల కింద.. 60 అడుగుల వ్యాసంలో విస్తరించి ఉన్న ఆ ఆకృతి ఏమిటి? ఏడాది క్రితం స్వీడిష్ ట్రెజర్ హంటర్ల కంటపడిన ఆ ఆకృతి.. యూఎఫ్‌వో (అన్ ఐడెంటిఫయింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)నా? ఆకాశం నుంచి కూలిపడిందా? ..దాదాపు ఏడాదికాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ వెళ్లిన 'ఓషన్ ఎక్స్' బృంద అన్వేషకులకు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది! సముద్ర గర్భాన యూఎఫ్‌వోకి 200 మీటర్ల దూరానికి చేరేసరికే వారివద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయలేదు. శాటిలైట్ ఫోను, కొన్ని కెమెరాలు ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఆ 200 మీటర్ల పరిధిలోంచి బయటికొచ్చాక ఆన్‌చేస్తే బాగానే పనిచేశాయి. మళ్లీ దాని సమీపంలోకి వెళ్లగానే ఆగిపోయాయి. "ఎలక్ట్రానిక్ వస్తువేదైనా సరే.. మా శాటిలైట్ ఫోన్‌తో సహా.. ఆ వస్తువు సమీపంలోకి వెళ్లేసరికి పనిచేయడం మానేసింది'' అని ఓషన్ ఎక్స్ బృందంలోని డైవర్ స్టెఫాన్ హోగర్‌బోర్న్ తెలిపారు. 

సముద్రగర్భాల్లో సంపద కోసం అన్వేషించేవారికి బాల్టిక్ సీ ఒక తరగని నిధి లాంటిది. దీని అడుగున దాదాపు లక్ష వస్తువులున్నట్టు అంచనా. అలా నిధుల వేటలోనే కొందరు అన్వేషకులు గతేడాది మే నెలలో దీని ఉనికిని పసిగట్టారు. ఆ ఆబ్జెక్ట్ నుంచి 985 మీటర్ల మేర రన్‌వే లాంటి దారిని కూడా వారు అప్పట్లో కనుగొన్నారు. "అది.. ఏదైనా ఉల్క కావచ్చు, గ్రహ శకలం కావచ్చు లేదా అగ్నిపర్వతం, ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి 'యు' బోట్ కావచ్చు,గ్రహాంతర నౌక... ఏదైనా కానీ, అదొక అసాధారణమైన వస్తువు అని మాత్రం చెప్పగలను'' అని ఓషన్ ఎక్స్ బృందంలోని డెన్నిస్ యాస్‌బెర్గ్ అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం.. ఆ నిర్మాణం రూపురేఖలను రూపొందించిన సోనార్ సాంకేతిక పరిజ్ఞానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సోనార్ పరిజ్ఞానంతో చిత్రీకరించిన కొన్ని అసాధారణ రూపాలు చివరికి సాదాసీదా రాళ్లుగా తేలాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iron age coins discovered in jersey after 30 year
Jac rejected rayala telangana proposal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles