Pranab to meet ap legislative assembly congress members

Pranab to meet AP Legislative Assembly Congress members on July 1

Pranab to meet AP Legislative Assembly Congress members on July 1

Pranab to meet AP Legislative Assembly Congress members.gif

Posted: 06/26/2012 09:05 PM IST
Pranab to meet ap legislative assembly congress members

ప్రస్తుత ఆర్థిక మంత్రి, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్న ప్రణబ్ ముఖర్జీ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతును కోరేందుకు వివిధ పార్టీల నాయకులను కలుసుకునేందుకు జులై 1వ తేదీన ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించి ఏసీసీఎల్పీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ రోజు జూబ్లీ హాలులో ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని, ఈ సమావేశానికి  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరుకావాల్సిందిగా ఆ ప్రకటనలో సీఎల్పీ కోరింది.

ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.ఐ.ఎమ్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే మద్దతు తెలిపారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, టీఆర్ఎస్ కి సంబంధించిన వారు మాత్రం ప్రణబ్ కి పోటీగా నిల్చున్న పీఏ సంగ్మాకి తన మద్దతును ప్రకటించారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని తనకు మద్దతు తెలపాలని పీఏ సంగ్మా చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ని కలుద్దామని వెళ్లినా , కుదరకపోవడంతో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసి తనకు మద్దతు ప్రకటించాలని కోరారు. అయితే జులై 1న రాష్ట్రానికి వస్తున్న ప్రణబ్ కూడా జైలు కెళ్ళి జగన్ మద్దతును కోరుతాడా ? లేక వైయస్ విజయమ్మను కలుస్తాడా ? అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Principal secretary p gautam kumar resigon
Indias tallst family with a combined height of 26ft hopes to enter record book  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles