Kashi vishwanath temple to get facelift

Kashi Vishwanath, Varanasi, Uttar Pradesh government, Uttar Pradesh

Varanasi's famous Kashi Vishwanath temple will be given a major facelift and the salaries of the priests will be increased, the Uttar Pradesh government announced

Kashi Vishwanath temple to get facelift.gif

Posted: 06/20/2012 04:33 PM IST
Kashi vishwanath temple to get facelift

Kashiపవిత్ర కాశీవిశ్వనాథుని దర్శనం ఇక పై మరింత అందుబాటులోకి రానుంది. జీవితంలో ఒక్కసారైన కాశీకి వెళ్ళి రావాలనుకుంటారు ప్రతి మనిషి. అలాంటి పుణ్యక్షేత్రం యొక్క దర్శనార్థం ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు. అక్కడ దర్శనం కోసం భక్తులు అనేక పాట్లు పడుతుంటారు. ఇక పై అలా కాకుండా  అచ్చం మన తిరుమల శ్రీవారి సేవలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లే.. వారణాసి పురాధీశుడి దర్శనానికీ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ఏర్పాట్లు చేసేందుకు శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఏటా శ్రావణమాసంలో కాశీలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌నెట్ ద్వారా దర్శనానికి నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయబోతున్నామని ఆ రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనంద్ సింగ్ తెలిపారు. అలాగే, కాశీ విశ్వేశ్వరుడికి చేసే సేవలను డీటీహెచ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించారు. మరి రానున్న కాలంలో మరిన్ని ఆలయాలకు కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aamir invited to parliament
Minister ganta srinivasa rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles