Human populations weight estimated at 316 million tons

Human Population's Weight Estimated At 316 Million Tons,health, biomass, overweight, fat, body mass, biomass, body mass index, human biomass, obese, average body mass, adult human biomass, obesity, global environmental sustainability, environmental sustainability

Human Population's Weight Estimated At 316 Million Tons

Human.gif

Posted: 06/19/2012 03:28 PM IST
Human populations weight estimated at 316 million tons

Human Population's Weight Estimated At 316 Million Tons

 స్థూలకాయమనేది ఆరోగ్యానికి చేటు తేవడమేకాక, పర్యావరణానికి సమస్యగా మారుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచదేశాల్లోని 24.2 కోట్ల ప్రజల్లో నడుము చుట్టుకొలత వేగంగా పెరు గుతున్నదని, ఫలితంగా వారు అదనంగా బరువును పొందుతున్నారని అధ్య యనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా యువతీయువకుల బరువు 28.7 కోట్ల టన్నులుందని, దీనిలో 1.5కోట్ల టన్నులు అధిక బరువు కాగా, 35లక్షల టన్నుల బరువు స్థూలకాయం వల్ల వచ్చినదే అని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌(ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం) అంచనా వేసింది. ఈ అధనపు బరువు 170 సైనిక విమాన వాహక నౌకల బరువుతో సమానం లేదా 24.2 కోట్లమంది సగటు బరువుల మొత్తానికి సమానంగా తెలిపింది.మానవులు తమ పొట్ట, నడుము కొలతలు పెరగటం వల్ల వారికి కలిగే అసౌకర్యాన్ని తెలిపేందుకు తాము అందరి బరువును స్థూలంగా గణించి చెప్పామని, ఇది పెరుగుతున్న జనాభా ప్రభావాన్ని తెలియజేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. 2050 నాటికి అధనంగా 23లక్షల ప్రజలు ప్రస్తుత జనాభాకు తోడవుతారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దీనిపై వివరణ ఇస్తూ... ‘ ఈ వాదన చాలా సులభమైనది. ఎక్కువ బాడీ మాస్‌ ఇండెక్స్‌( శరీర బరువు సూచిక) వల్ల సదరు వ్యక్తులు తమ అధనపు ఆహారంకోసం పర్యావరణంపై ఆధారపడుతారు. ఈ విధంగా భూమిపై, తదితర వనరులపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పరిశోధకులు అన్నారు.

కాగా ఆసియా, సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో జనాభా భారీగా పెరిగే అవకాశాలున్నాయని, అమెరికాలో పెరిగిన జనాభా బరువు వారి సంఖ్య కంటే ఎక్కువ ఉందని తాము గుర్తించామని పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు. పరిశోధకులు 2005లో ఉన్న ప్రజల సంఖ్య ఆధారంగా గణాంకాలను తయారుచేశారు.అప్పటి జనాభాలో స్థూలకాయం కారణంగా వారి అధనపు బరువు 35 లక్షల టన్నులుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా సగటు వ్యక్తి బరువు 62 కిలోలుగా లెక్క కట్టారు. అధిక బరువుఉన్న ప్రజల దేశాల్లో అత్యధిక బరువు ఉన్న 10 దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. తేలికైన బరువున్న 10 దేశాల జాబితాలో ఆఫ్రికన్‌, అసియాదేశాల పేర్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అసియాదేశాల్లో 61 శాతం ప్రజలు వున్నప్పటికి, వారు కేవలం 13 శాతం మాత్రమే బాడీమాస్‌ ఇండెక్స్‌ను కలిగివున్నారు. ప్రపంచం ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత దృష్ట్యా ప్రజల స్థూలకాయ సమస్యను ఎదుర్కోవటం కష్టతరమైనదే అని పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cat sets aside appointment of dinesh reddy as andhra dgp
Australian doctors successfully test heart valve technology  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles