Summons for tamilnadu governor rosaiah

summons for tamilnadu governor rosaiah

summons for tamilnadu governor rosaiah

32.gif

Posted: 06/18/2012 08:24 PM IST
Summons for tamilnadu governor rosaiah

      ఇవాళ తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఎసిబి కోర్టు (సోమవారం) సమన్లు జారీ చేసింది. హైదరాబాదులోని అమీర్‌పేట భూముల కేటాయింపు కుంభకోణం కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రోశయ్యను ఆదేశించింది.అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 9e2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు.ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు గతంలో సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే 9.14 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు.
     ఇదిలా ఉండగా,  మద్యం సిండికేట్ల వ్యవహారంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25వరకూ ఉమేష్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ నిలిపివేయాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అంతలోపు ఐపీఎస్ అధికారి వచ్చి కోర్టులో లొంగిపోవాలని నిర్దేశించింది. ఆ తరువాత నాన్ బెయిలబుల్ వారెంట్ ప్రకారం వ్యవహరించవచ్చని కోర్టు పోలీసులకు సూచించింది.
     కాగా,  సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెన్షన్ కు రంగం సిద్ధమైంది. ఫోర్జరీ కేసులో ఉమేష్‌కుమార్‌పై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఉమేష్‌కుమార్‌పై సస్సెన్షన్ వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in tamilnadu
Bollywood pair ajay and kajal does a documentary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles