Stanford gets jailed for 110 years

Stanford Gets Jailed For 110 Years,Allen Stanford, fraud, Ponzi scheme,

Stanford Gets Jailed For 110 Years

Stanford.gif

Posted: 06/16/2012 11:01 AM IST
Stanford gets jailed for 110 years

Stanford Gets Jailed For 110 Years

ప్రజలను మోసగించినందుకు స్టాన్‌ఫోర్డ్‌కు 230 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసి, భారీ స్థాయిలో అర్థిక అవకతవకలకు పాల్పడిన స్టాన్‌ఫోర్డ్‌పై కఠినంగా వ్యవహరించాలని కోర్టును కోరారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను స్టాన్‌ఫోర్డ్ కొట్టిపారేశాడు.  ‘క్రికెట్ మొఘల్’గా పేరు సంపాదించిన అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త అలెన్ స్టాన్‌ఫోర్డ్‌కు టెక్సాస్ కోర్టు 110 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టి-20 మ్యాచ్‌లకు సంబంధించి 20 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న స్టాన్‌ఫోర్ట్ ఆతర్వాత హఠాత్తుగా కాంట్రాక్టు నుంచి వైదొలిగాడు. అంతకు ముందే అతనిపై పలు కేసును నమోదయ్యాయి. ఇనెవస్టర్లను మోసగించాడని, నమ్మకద్రోహం చేశాడని స్టాన్‌ఫోర్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మొత్తం 13 కేసుల్లో అతనిని కోర్టు దోషిగా తేల్చిందితాను జూదం ఆడలేదని వ్యాఖ్యానించాడు. ఉద్దేశపూర్వకంగా తాను ఎవరికీ నమ్మక ద్రోహం చేయలేదని స్పష్టం చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత అతనికి 110 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నట్టు టెక్సాస్ డిస్ట్రిక్ట్ జడ్జి డేవిడ్ హిట్నర్ ప్రకటించారు. వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన స్టాన్‌ఫోర్డ్‌కు క్రికెట్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pinky pramanik arrested on charges of rape
Cong swept away by jagan wave in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles