Parsi earning rs 90k per month is poor

Parsi earning Rs 90K per month is poor,Parsi earning, poor eligible, Parsi community, housing scheme, Bombay Parsi Punchaye, business news

Parsi earning Rs 90K per month is poor

Parsi1.gif

Posted: 06/13/2012 08:32 PM IST
Parsi earning rs 90k per month is poor

Parsi earning Rs 90K per month is poor

 ప్రణాళికా  సంఘం లెక్కల ప్రకారం  రోజుకు 32 రూపాయలకన్నా  తక్కువ సంపాదించేవారు  పేదవారేమో   కానీ .. ముంబై పార్సీ సంఘం  ప్రకారం  నెలకు రూ. 90  వేల కన్న తక్కువ  సంపాదించే పార్సీలే  పేదలు.  సగటు  భారతీయుడు  నోరెళ్లబెట్టే ఈ  వాస్తవాన్ని  బాంబే  పార్టీ పంచాయిత్   బాంబే  హైకోర్టుకు తెలిపింది.  పార్సీ  పంచాయత్  ప్రకారం  గతంలో 50  వేల ఆదాయం ఉన్న పార్టీలు  పేదలు  కాగా, దానిని  ఇటీవలే రూ. 90 వేలకు పెంచినట్లు  పంచాయత్ తెలిపింది.  ముంబైలో  పార్సీలకు  సుమారు 5 వేల ఇళ్లున్నాయి.  వీటికిగాను  పార్సీ  పంచాయత్  పార్సీలకు  నెలసరి  బాడుగకు  ఇస్తోంది.  ఇటీవల  అంధేరీలోని  కొన్ని  ప్లాట్లను తమలోని పేద పార్సీలకు  విక్రయించాలని  ఇటీవల  పంచాయత్  నిర్ణయించడంతో వాటిలో  ఒక ప్లాట్ ను  గుండె జబ్బుతో  బాధపడుతున్న  తనకు  విక్రయించాలని  థానే జిల్లా  దహను  వాస్తవ్యుడు  రోహిన్ టన్  టపోర్ వాలా (65)  దరఖాస్తు  చేసుకున్నారు.  అందుకు పార్సీ పంచాయత్   నిరాకరించడంతో  ఆయన బాంబే  హైకోర్టుకు వెళ్లారు.  అయితే టపోర్ వాలకు  దహనులో 17  ఎకరాల పొలం, 2 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించిన  బంగ్లా ఉన్నాయని . ఆయన ఆస్తి 15.3  కోట్ల వరకు  ఉండవచ్చని కోర్టుకు  తెలిపింది.  ఐతే నెలకు  రూ. 90 వేల కన్నా  తక్కువ  ఆదాయం ఉన్నవారికే  ఆ ప్లాట్లను  విక్రయించాలన్నది  తమ పంచాయత్  నిర్ణయమని  కోర్టుకు  తెలిపింది.  టపోర్ వాలా  నెలకు 90 వేల కన్నా తక్కువ సంపాదించే  పేద వర్గం  కిందికి రానందున్న  ఆయనకు ప్లాట్ ను విక్రయించలేమని  పేర్కొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indan train
Automatic electric samrat bed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles