Kiran bedi lashes out at prime minister manmohan singh

Kiran Bedi lashes out at Prime Minister Manmohan Singh,Vayalar Ravi,Team Anna, Salman Khurshid, Manmohan Singh, Kiran Bedi, Anna Hazare,

Kiran Bedi lashes out at Prime Minister Manmohan Singh

Kiran.gif

Posted: 06/11/2012 12:27 PM IST
Kiran bedi lashes out at prime minister manmohan singh

Kiran Bedi lashes out at Prime Minister Manmohan Singh

అన్నా బృందానికి, యుపిఎ ప్రభుత్వానికి మధ్య సాగుతున్న యుద్ధం ఏకంగా మహాభారతం వరకూ వెళ్లింది. అన్నా బృందం సీనియర్ నాయకురాలు కిరణ్ బేడీ ఏకంగా మన్మోహన్‌సింగ్‌ను ధ్రృతరాష్ట్రుడితో పోల్చారు. అంతేకాదు, అవినీతి పంకిలమైన ఆయన పాలనవల్ల నేరస్థులకు తగిన శిక్షపడే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ న్యాయశాఖ మంత్రి ఖుర్షీద్ ‘అన్నా బృందం ఇలా వ్యక్తిత్వ హననానికి దిగడం ఎంతమాత్రం సమంజసం కాదు’ అని స్పష్టం చేశారు. అలాంటివాటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మన్మోహన్‌సింగ్ ప్రమేయం లేదని ప్రధానమంత్రి కార్యాలయం తేల్చింది.

అయితే ద్రౌపది వస్త్రాపహరణకు యత్నించిన కౌరవులకు ధృతరాష్ట్రుడు మద్దతు తెలపలేదు. అలాగని ఆ ఘటనతో ధృతరాష్ట్రుడికి సంబంధం లేదని అనగలరా?’ అని బేడీ ప్రశ్నించారు. సమర్థవంతమైన న్యాయవ్యవస్థను ప్రజలకు అందించగలిగేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయేనని, ప్రతిపక్షం కాదనీ, అందుకే కేంద్రంపైనే అన్నా బృందం దృష్టి సారించిందని బేడీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, 14మంది కేబినెట్ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిట్‌తో విచారణ జరిపించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేయాలని అన్నా హజారే డిమాండ్‌కు ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించిన మరుసటి రోజే ప్రధాని లక్ష్యంగా కిరణ్ బేడీ ఆరోపణాస్త్రాలు సంధించారు. సిట్‌తో విచారణ జరిపించి తీరాలనే డిమాండ్‌పై జూలై 25 నుంచి ఆఖరి పోరాటాన్ని చేపట్టి అమీతుమీ తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై పిఎంఓ పంపిన లేఖ వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందన్నారు.

కిరణ్‌బేడీ ఆరోపణలను మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘అవినీతిపై ఉద్యమాన్ని వారు మంచి ఆలోచనతో ప్రారంభించారని మేం భావించాం. కానీ ఈ రోజు వ్యక్తిగత ఆరోపణలు, స్వలాభం కోసం దాన్ని వాడుకుంటున్నార’ని ఖుర్షీద్ ధ్వజమెత్తారు. ‘సమయం వచ్చినప్పుడు ఈ దేశం వారికి సరైన సమాధానం చెబుతుందని నమ్మకంతో ఉన్నాన’ని ఆయన స్పష్టం చేశారు.కాగా, హజారే బృందానికి తోడుగా బిజెపి కూడా యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. యుపిఎ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలన్న అన్నా బృందం డిమాండ్‌కు బిజెపి వత్తాసు పలికింది. మన్మోహన్‌సింగ్ నిజాయితీపరుడైనప్పటికీ అవినీతి ఆరోపణలకు ఒక నాయకుడుగా ఆయన బాధ్యుడేనని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy remand extended
Cbi to conduct narco test on ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles