Mukesh ambani led reliance industries to invest rs 1 lakh crore in 5 years to double profit

Mukesh Ambani led Reliance Industries to invest Rs 1 lakh crore in 5 years, to double profit,RIL stock,RIL AGM,Reliance Industries Ltd.,Reliance Industries,Nita Ambani,Mukesh Ambani,KG D6 block,Dhirubhai Ambani

Mukesh Ambani led Reliance Industries to invest Rs 1 lakh crore in 5 years, to double profit

Mukesh.gif

Posted: 06/08/2012 12:57 PM IST
Mukesh ambani led reliance industries to invest rs 1 lakh crore in 5 years to double profit

Mukesh Ambani led Reliance Industries to invest Rs 1 lakh crore in 5 years, to double profit

 కేజీ బేసిన్‌లోని తమ డి 6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి సమస్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) రానున్న కాలంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో కూడిన భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో సంస్థ నిర్వహణ లాభాన్ని రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ఇంధనం, రిటైల్, టెలికాం వ్యాపారాల్లో విస్తరణ పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. మూడు నాలుగేళ్లలో రిటైల్ విభాగంలో ఆదాయం ఆరురెట్లు, అమెరికాలోని తమ షేల్ గ్యాస్ అమ్మకాల టర్నోవర్ పదిరెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇక్కడ షేర్‌హోల్డర్ల సమావేశంలో వెల్లడించారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో 1200 కోట్ల డాలర్ల పెట్టుబడులు చేయనున్నామని, కెజి-డి 6 ఆయిల్ క్షేత్రాల్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిని రెట్టింపుచేస్తూ రోజువారీ 60 మిలియన్ క్యుబిక్ మీటర్ల స్థాయికి విస్తరిస్తామని ఆయన తెలిపారు. రిలయన్స్ నికరలాభం గడచిన రెండు క్వార్టర్లలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో కంపెనీ షేరు గత మూడేళ్ల కనిష్టస్థాయికి క్షీణించింది.

ఈనేపధ్యంలో వచ్చే ఐదేళ్లలో కంపెనీ నిర్వహణ లాభాన్ని రెట్టింపుచేయాలని తానుగా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు అంబానీ తెలిపారు. కీలక వ్యాపారాల్లో భారీ పెట్టుబడుల ద్వారా సంస్థను అధిక లాభదాయక మార్గాల్లో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మరింత బలమైన, వివిధీకరణ చెందిన సంస్థగా తీర్చిదిద్దేందుకు రానున్న ఐదేళ్లలో రిలయన్స్ రూ.లక్ష కోట్లు ఇనె్వస్ట్ చేయనుందని వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక రేట్లలో ఒడిదుడుకులు, ఇంధన సబ్సిడీలు, మందకొడి ఆర్థిక ప్రగతి వంటి అంశాలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా అంబానీ వివరించారు.

 తూర్పుతీర కెజి-డి 6 ఫీల్డ్స్‌లో ఉత్పత్తి 61.5 ఎంఎంసిఎండి నుంచి 32 ఎంఎంసిఎండికి క్షీణించిందని తెలిపారు. ఇది కంపెనీ పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావానికి దారితీసిందని అన్నారు. రానున్న మూడు నాలుగేళ్లలో మొత్తం ఉత్పత్తిని 60ఎంఎంసిఎండి స్థాయికి పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని అంబానీ వెల్లడించారు. అలాగే ఇదేకాలంలో రిటైల్ బిజినెస్ ద్వారా రూ.40-50 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంబానీ చెప్పారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Missing starlet laila khan recced mumbai for let
Pak chief justice recuses himself from sons case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles