Bjp promises telangana

BJP promises Telangana, G kishanareddy, BJP Party, MLA , TRS Party,

BJP promises Telangana

BJP.gif

Posted: 06/08/2012 10:44 AM IST
Bjp promises telangana

BJP promises Telangana

వందేళ్లయినా టీఆర్ఎస్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి, నడికూడ, చౌటుపర్తి, ముస్త్యాలపల్లి, చర్లపల్లి, నార్లాపూర్, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో జరిగిన ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. ఒక్క బిడ్డ ఆత్మహత్య లేకుండా.. ఒక్క రక్తపు బొట్టు నేల రాలకుండా తెలంగాణ సాధించే బాధ్యత బీజేపీదేనన్నారు. పాలమూరులో గెలిచాం.. పరకాలలో గెలుస్తాం.. తెలంగాణ తెస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడిన ఘనత బీజేపీదేనన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మబంధువు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రావాలంటే పార్లమెంట్‌లో 273 సీట్లు అవసరమని, రెండు సీట్లున్న టీఆర్ఎస్ తెలంగాణ ఎలా తెస్తుందని ఆయన ప్రశ్నించారు.

ప్రజలు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.టీఆర్ఎస్ కుటుంబసభ్యుల పార్టీ అని ఆరోపించారు. కొడుకు విదేశాల్లో ఉండగానే ఎమ్మెల్యేను చేశాడని, అల్లుడిని ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేశాడని ఆరోపించారు. ఉద్యమం పేరిట 11 ఏళ్లుగా టీఆర్ఎస్ సాధించిందేమీ లేదన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే టీఆర్ఎస్‌ను ప్రజలు దెబ్బకొట్టి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. పరకాల ప్రజలు రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కలిగిన వారని, బీజేపీతో తెలంగాణ సాధ్యమని విశ్వసిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్్‌కు అమ్ముడుపోయి టీఆర్ఎస్ అభ్యర్థి రహమాన్ ఓటమికి కారకుడైన ఎమ్మెల్యే కల్వకుంట బీజేపీని విమర్శించడం హేయమని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి నిలయమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి కేంద్రంలో బీజేపీ 300 పార్లమెంట్ స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Divorce hotel to help couples separate during two day stay
Nra opposes background check requirements al qaeda plan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles