Mother threatening me says veerappan s daughter

Mother threatening me, says Veerappan’s daughter, Muthulakshmi, Veerappan

Mother threatening me, says Veerappan’s daughter

Veerappan.gif

Posted: 06/07/2012 11:43 AM IST
Mother threatening me says veerappan s daughter

Mother threatening me, says Veerappan’s daughter

ఒంటరిగా వస్తే సర్టిఫికెట్లు ఇస్తానని తల్లి చెప్పడంతో.. ఆ మాటలు నమ్మి గత నెల 5న మేచేరి సమీపంలోని పొట్టనేరి గ్రామంలో ఉంటున్న తల్లి ముత్తులక్ష్మి ఇంటికి వెళ్లానని, అప్పుడు కూడా..'నీ భర్తను వదిలి నాతో ఉంటే సర్టిఫికెట్లు ఇస్తా' అని తల్లి షరతు విధించడంతో, ఆమెను నమ్మించినట్లు నటించి సర్టిఫికెట్లు ఉన్న చోటు తెలుసుకుని వాటిని తీసుకొని తన ఇంటికి చేరుకున్నానని వివరించారు.తమ ప్రేమ వివాహం తల్లికి ఇష్టం లేకపోవడంతో ఆమె తన మనుషులతో తమను ఎన్నోరకాలుగా వేధించినట్టు తెలిపారు. వేధింపుల్లో భాగంగా ఆమె తన సర్టిఫికెట్లను కూడా తీసుకెళ్లిపోవడంతో.. వాటికోసం తల్లితో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు చెప్పారు.


వీరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విద్యారాణి (22) కృష్ణగిరి పాతిమా నగర్‌కు చెందిన మరియ దీపక్‌ను ప్రేమించి గత సంవత్సరం ఆగస్టు 30న వివాహం చేసుకుంది. వారిద్దరూ కృష్ణగిరిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారు. పేరు మోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తెలు.. తమకు తమ తల్లి నుంచి ప్రమాదం ఉందని తమిళనాడులోని కృష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 5నవిధులకు వెళ్లిన విద్యారాణి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమెను ఎవరో అపహరించుకెళ్లారనే వదంతులు వ్యాపించాయి.  తన చెల్లెలు విజయలక్ష్మిది కూడా ప్రేమవివాహమేనని, దీంతో తల్లి ముత్తులక్ష్మి మనుషులు విజయలక్ష్మిని, ఆమె భర్త షణ్ముగరాజ్‌ను తీసుకెళ్లి కర్ణాటక రాష్ట్రం నల్లూరు సమీపంలో అడవిలో ఉంచి చిత్రవధ చేశారన్నారు. ఆమె కూడా ఆ నరకం నుంచి తప్పించుకుని భర్త ఇంటికి చేరుకుందని, ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భవతి అని తెలిపారు. తమకు, తమ భర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే తమ తల్లే బాధ్యత వహించవలసి వస్తుందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని విద్యారాణి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All government websites to move to ipv6 by year end
Facebook vanishing in 2020 predicts an analyst  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles