Is gali in jail because of vastu dosham

VASTU DOSHAM for Gali House.gif

Posted: 06/06/2012 12:22 PM IST
Is gali in jail because of vastu dosham

Gali-Janardhan-reddyకేరళలోని ‘పద్మనాభ స్వామి’ ఆలయంలో ఉన్న నేల మాలిగల్లో వేల కోట్ల సంపద బయట పడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెరిచిన 5 నేల మాలిగల్లో వేల కోట్ల సంపదను గుర్తించారు. ఆరో నేల మాళిగలో వీటన్నింటిని మించి సంపద ఉన్నట్లు చెబుతున్నారు. ‘అనంత పద్మనాభుడు’ కాబట్టి అనంత సంపదను కూడబెట్టుకున్నాడు. ఆ విషయం పక్కన పెడితే...

ఇప్పుడు అక్రమ గనుల ‘గజిని’ గాలి జనార్థన్ రెడ్డి అక్రమంగా కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించిన విషయం తెలిసిందే. మరి ఆ డబ్బంత ఇక్కెడ దాచాడు ? హవాలా రూపంలో విదేశాలకు తరలించాడా ? లేక తన కలల సౌధంలోనే ఎవరికి అనుమానం రాకుండా నేల మాళిగల్లో దాచాదా ? అతని డబ్బు అతని కలల సౌధంలోనే నేల మాళిగల్లో దాచారానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీబీఐ వర్గాలు.
ఈ అనుమానానికి కారణం ఉన్న ఫలంగా గాలి జనార్థన్ రెడ్డి తన ఇంటిలో ఉన్న కుటీరంలో వాస్తు మార్పులు చేయడమే. ఇంధ్రభవనాన్ని తలపించే గాలి నివా సం వెలుపల 58 అడుగుల వెడల్పు, 101 అడుగుల పొడవు గల కుటీరముంది. దాన్ని మొత్తం టేకుతోనే నిర్మించారు. ఎంతో ఇష్టంతో గాలి ఈ కుటీరాన్ని తనకు నచ్చినట్లు కట్టించుకున్నారు. 

తనకు కాలం కలిసి రాకపోవడానికి వాస్తులోపమే కారణమని గాలి జనార్దనరెడ్డి భావించినట్లు న్నారు. అనుకున్నదే తడవుగా తన కుటీరంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన జైలుకు వెళ్లాక ఈ కుటీరం కళ తప్పింది. పైగా వాస్తు దోషముందని భావించి కుటీరంలోని బాత్‌రూంను, టాయిలెట్‌ను కూల్చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  అయితే ఈ కుటీరంలో నేలమాళిగలు ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. ప్రస్తుతం కుటీరంలో కొంత భాగాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

ఒక వేళ సీబీఐ అనుమానం నిజమైతే.. గాలిజనార్థన్ రెడ్డి కుటీరంలో ఉన్న నేళమాళిగల్లో అనంత పద్మనాభ స్వామిని మించి పోయే ధనం ఉందా ? తక్కువగా ఉంటుందా అని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముందో గాలికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla turpu jayaprakash reddy
Cbi jd lakshminarayana gets fan clubs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles