Dalai lamas china talk envoys resign

Dalai Lama's China talk envoys resign

Dalai Lama's China talk envoys resign

Dalai.gif

Posted: 06/04/2012 10:44 AM IST
Dalai lamas china talk envoys resign

Dalai Lama's China talk envoys resign

భారత దేశం ఎప్పుడు కూడా ప్రవాస జీవితం గడుపుతున్న టిబెటన్ల పట్ల ఉదారంగానే వ్యవహరిస్తోందని ఆయన అంటూ భారత దేశాన్ని గురువుగా, టిబెటన్లను శిష్యులుగా అభివర్ణించారు. 1951నుంచి తాను టిబెట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీకి చురుకైన కార్యకర్తగా ఉండేవాడినని, మిగతా వారిలాగానే తాను కూడా కపటిగా ఉండడం కోసమే తన టాలెంట్‌నంతా ఉపయోగించానని దలైలామా చెప్పారు. అయితే తాను భారత దేశానికి వచ్చిన తర్వాతే ఆ కపటం తనలో అంతరించిపోయిందని ఆయన చెప్పారు. భారత దేశాన్ని తన రెండో పుట్టినిల్లుగా చేసుకున్న గత 53 ఏల్ల కాలంలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఉత్తర భారతీయులు ఎంతో ఇష్టంగా తినే దాల్- రోటీ పట్ల మక్కువ పెంచుకున్నారు. 1959లో టిబెట్‌ను వదిలిపెట్టి పారిపోయి వచ్చినప్పటినుంచి ధర్మశాలలో గడిపిన రోజులను దలైలామా గుర్తు చేసుకుంటూ, భారత దేశానికి వచ్చిన తర్వాత తాను నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే కపటం లేకుండా ఎలా ఉండావచ్చనేదని అన్నారు. భారత దేశానికి వచ్చి ఇనే్నళ్ల పాటు ఇక్కడ గడిపాక తాను భారతీయ సంస్కృతి, మతంనుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కూడా ఆయన అంటూ, ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టంగా తినే దాల్-రోటీ పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం వాటిలో ఒకటని చెప్పారు. తనకు అవకాశమొచ్చినప్పుడల్లా ఈ గొప్ప భారతీయ వంటకాన్ని రుచిచూస్తూ ఉంటానని కూడా ఆయన పిటిఐతో మాట్లాడుతూ చెప్పారు.

టిబెట్‌నుంచి పారిపోయి వచ్చినప్పటినుంచి వేలాది మంది టిబెట్లతో కలిసి దలైలామా ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. భారత దేశాన్ని విద్యలకు కేంద్రంగా, బీహార్‌లోని ప్రాచీన నలంద విశ్వ విద్యాలయాన్ని బౌద్ధమత భాండాగారంగాను ఆయన తరచూ అభివర్ణిస్తుంటారు. బుద్ధుడి ఆశీస్సులు, బౌద్ధమత బోధనల కారణంగానే బీహార్ ఇప్పుడు అనివృద్ధి పథంలో పయనిస్తోందని బుద్ధుడి పేరుతో ఏర్పాటు చేసిన ఒక పార్కును ప్రారంభించడం కోసం తాను ఇటీవల పాట్నా వెళ్లినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనతో అన్నారని ఆయన చెప్పారు.అయితే వాస్తవానికి బీహార్ బౌద్ధ మతానికి జన్మస్థానమని, మొత్తం ప్రపంచానికి ఈ గొప్ప మతానికి అందించిన ప్రదేశమని తాను ఆయనతో అన్నానని దలైలామా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nuzvid td mla likelyt to join congress
Visakha and kadapa terrific news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles