Tsr steps up election campaign

TSR steps up election campaign, Congress Party, Nellore District, T subbiramireddy, TSR, Eswara

TSR steps up election campaign

TSR.gif

Posted: 06/02/2012 12:09 PM IST
Tsr steps up election campaign

TSR steps up election campaign

నెల్లూరు గడ్డపై జన్మించిన తనకు ఇక్కడి ప్రజల రుణం తీర్చుకునేలా ఓటర్లంతా ఆలోచనతో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల రూపంలో తనకు అవకాశం వచ్చిందని, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే జన్మభూమికి సేవ చేసే ఛాన్స్ లభిస్తుందన్నారు. తనను నెల్లూరు ఎంపిగా గెలిపిస్తే అంతులేని అభివృద్ధికి బాటలు వేస్తానంటూ రాజ్యసభ సభ్యులు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఆయన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఉదయగిరి నియోజకవర్గంలో నెలకొని ఉన్న ఫ్లోరిన్ నీటి బెడదను తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. అభివృద్ధి అన్నివర్గాల ప్రజానీకానికి అందేలా, సమగ్రంగా ఉండేలా కృషి చేస్తానంటూ కార్యకర్తల ముందు శపథం చేశారు. తనను గెలిపిస్తే చేసిన మాట తప్పక నెరవేర్చి చూపుతానన్నారు. ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే అంతకంతకూ రుణం తీర్చుకుంటానన్నారు. తాను స్వతహాగా ఈశ్వరభక్తుడ్ని అని ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆడిన మాట తప్పడం శివుడికిగాని, ఆ దేవదేవుడి భక్తుడిగా తనకుగాని లేవన్నారు. రాజీవ్‌గాంధీ పిలుపుతో తాను కాంగ్రెస్‌పార్టీలోకి వచ్చానన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్‌లో అంకితభావంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలొస్తుంటాయి... పోతుంటాయే తప్ప ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysvijayammasharmila speech in election campaign
I am not involved in gali bail scam says minister erasu prathap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles