Nurse threw drugs into mouths of patients as if she was playing darts misconduct panel hears

Nurse threw drugs into mouths of patients as if she was playing darts, misconduct panel hears,NRI nurse, UK patients, world news

Nurse threw drugs into mouths of patients as if she was playing darts, misconduct panel hears

Nurse.gif

Posted: 06/01/2012 12:50 PM IST
Nurse threw drugs into mouths of patients as if she was playing darts misconduct panel hears

Nurse threw drugs into mouths of patients as if she was playing darts, misconduct panel hears

నర్స్.. అంటే సేవాభావానికి నిలువెత్తు ప్రతిరూపం! కానీ... బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన ఒక నర్సు ఆ పదానికే అవమానం తెచ్చేలా ప్రవర్తించింది. రోగుల వద్దకు వెళ్తే వారి ఇన్ఫెక్షన్లు తనకెక్కడ సోకుతాయో అనే భయంతో.. వారిని నోరు తెరవమని దూరం నుంచే మందుబిళ్లలు విసరడం మొదలుపెట్టింది. ఈ బాగోతం బయటపడటంతో నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆమెను ఏడాది పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇక్కడి స్మెత్‌విక్ (బర్మింగ్‌హామ్) ప్రాంతంలోని పోప్లార్స్ నర్సింగ్‌హోంలో సరితామిట్టల్ (46) నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది.

కేన్సర్ బాధితులు, పార్కిన్స్‌న్స్, మోటార్ న్యూరాన్ డిసీజ్ వంటి వాటితో బాధపడే పలువురు రోగులు ఇక్కడ చికిత్స తీసుకుంటారు. నర్సుగా వారు మందులు సరిగా వేసకునేలా చూసుకోవాల్సిన బాధ్యతను సరితామిట్టల్ విస్మరించింది. వారు మురికిగా ఉన్నారని.. వారి ఒంటి నుంచి సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్లు తనకు ఎక్కడ సోకుతాయో అనే భయంతో.. 2-3 అడుగుల దూరంలో నిలబడి మందులు వారి నోట్లో పడేలా విసిరేదని ఎన్ఎంసీ ముందు బాధితుల తరఫు న్యాయవాది వివరించారు.

అంతేకాదు, పది గంటలపాటు విధులు నిర్వర్తించాల్సిన ఆమె... రిసెప్షన్ వెనకాలే ఒక మంచాన్ని ఏర్పాటు చేసుకుని రోగుల బాగోగుల్ని పట్టించుకోకుండా కనీసం ఐదుగంటలు నిద్రపోయేదట. నర్సింగ్ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన సరితా మిట్టల్‌పై ఎన్ఎంసీ మండిపడి సస్పెన్షన్ శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iranian prof cut ate wife s lips
Raising age of consent for love to 18 regressive undemocratic court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles