Time pass employees

time pass employees

time pass employees

employees.gif

Posted: 05/30/2012 12:16 PM IST
Time pass employees

time pass employees

ఎంతో నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ సిబ్బందిని ఖాళీగా కూర్చోబెట్టి మరీ జీతాలు చెల్లిస్తుండటం హెచ్‌ఎండీఏకే చెల్లింది. ఈ విభాగంపై ఏటా రూ.2కోట్ల మేరకు జీతభత్యాలకు వెచ్చిస్తున్నారు. ఆ మేరకు పని లేదు. గతంలో చేపట్టిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, పీవీ ఎక్స్‌ప్రెస్ వే ర్యాంపులు, కూకట్‌పల్లి ఆర్వోబీ నిర్మాణం పనులు మాత్రమే సాగుతున్నాయి. వీటి పర్యవేక్షణకు మూడోవంతు సిబ్బంది సరిపోతారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే... ఇక పనే ఉండదన్న ఉద్దేశంతో కావాలనే వాటి నిర్మాణాన్ని స్లో డౌన్ చేసినట్లు వినవస్తోంది. ఫలితంగా హుస్సేన్‌సాగర్‌లో ఎప్పుడో పూర్తికావాల్సిన నాలాల పూడికతీత పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉన్నాయి. మియాపూర్‌లో తలపెట్టిన భారీ బస్ టెర్మినల్‌కు అతీగతీ లేదు.

time pass employees

చేతుల్లో కొత్త ప్రాజెక్టు లేదు.. నడుస్తున్న ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి. ఖజానా ఖాళీ. ఆర్థిక వనరుల సముపార్జనకు అవకాశం ఉన్నా ఆ దిశగా ఒక్క అడుగు పడట్లేదు. కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేయాల్సిన ఇంజినీరింగ్ విభాగానికి అసలు పనే లేకుండాపోయింది. ఎస్‌ఈ స్థాయి అధికారులు సైతం గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు. ఇదీ.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రస్తుత దుస్థితి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన హెచ్‌ఎండీఏకి అసలు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. గడచిన నాలుగేళ్లుగా కొత్త ప్రాజెక్టుల రూపకల్పన,అమలు లేకపోవడంతో కీలకమైన ఇంజినీరింగ్ విభాగం నిర్వీర్యం అంచుకు చేరువైంది. ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టుల తర్వాత ఇంతవరకు మరే ఇతర ప్రాజెక్టులు చేపట్టలేదు. చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో సుమారు 55మంది సాంకేతిక సిబ్బందితో పనిచేస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. సీఈ 1, ఎస్‌ఈ1, ఈఈలు 7, డీఈలు 14, ఏఈలు 12 మొత్తం 35 మంది ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో ఏడుగురు ఈఈలు, ఎస్‌ఈ 1, సీజీఎం 1, మరో 10 మంది ఏఈలతో కలిపి మొత్తం 55 మంది ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan mohan reddy turns chanchalguda into party office
Mamata slammed for overboard kkr celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles