Former minister mopidevi venkata ramana in care hospital today

former minister mopidevi venkata ramana in care hospital today

former minister mopidevi venkata ramana in care hospital today

9.gif

Posted: 05/27/2012 04:49 PM IST
Former minister mopidevi venkata ramana in care hospital today

      సీబీఐ కస్టడీలో ఉన్న మోపిదేవి వెంకట రమణ ఇవాళ (ఆదివారం) అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయనను సీబీఐ అధికారులు సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తున్నది.16 జగన్ అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేశారని మూడు రోజుల నుంచీ మానసికంగా మోపిదేవి వేదన పడుతున్నట్లు సమాచారం. దీనితో హైబీపీ పెరిగి కళ్ళు తిరుగుతూ ఉండవచ్చని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవిని సీబీఐ 24న అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
      ఇదిలా ఉండగా,  వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ వరుస పరంపర అరెస్టులు, విచారణలు మలుపుతిరుగుతూ అధికార కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటోంది. వాన్ పిక్ కేసులో అనూహ్యమైన రీతిలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి అరెస్ట్ అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. sabitaఈ పరిణామంలో విచారణ ఎదుర్కోబోతున్న మరో ఐదుగురు మంత్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి సైతం సీబీఐ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన నష్టనివారణ చర్యలు చేపట్టే పనిలో పడ్డారు. మంత్రులు మాత్రం సీబీఐ దూకుడు తగ్గించాలని అవసరమైతే అధిష్టాన వర్గాన్ని కలవాలని పట్టుబడుతున్నారు. నేరమొకరిది వైఎస్ చేస్తే, ఫలాలు జగన్ అనుభవిస్తున్నాడని .. శిక్షలు మాకా.. అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు.

       అయితే సాయంత్రానికి ఆరోగ్యం కుదుటపడటంతో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయనకు బీపీ పెరగడంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స జరిపారు.  డిశ్చార్జీ అనంతరం ఆయనను దిల్‌కుషా అతిథి గృహానికి తరలించారు.

     అయితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మంత్రి వర్గంలో..... ఆయనకు లోకువగా ఉండేవారిని, అతను ఏది చెబితే దానికి ఎస్ చెప్పే వారినీ అందుకో అక్కున చేర్చుకున్నారని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. తను తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పే స్వభావం గల సీనియర్ నేతలను వైఎస్ తన హయాంలో అందుకే దూరంగా ఉంచారని విశ్లేషిస్తున్నారు. అదే ఇప్పుడు మంత్రులకు పీకమీదకొచ్చిందని వారి భావన.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress president jagan arrested
Former tdp rajyasabha mps future course of actions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles