Main opposition party in national politics bjp suffers

main opposition party in national politics bjp suffers

main opposition party in national politics bjp suffers

19.gif

Posted: 05/27/2012 03:41 PM IST
Main opposition party in national politics bjp suffers

       యూపీఏ-2 వైఫల్యాల నేపధ్యంలో దేశ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాల్సి ఉన్న బీజేపీ కష్టాల కడలిని ఈదుతోంది.  సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాల్సిన ప్రధాన ప్రతిపక్షం అంతర్గత పోరుతో చతికిలబడుతోంది. పార్టీలో ఒకరి పొడ ఒకరికి గిట్టకపోవడం, పైకి కనపడని శతృత్వం బిజెపిని పట్టి పీడిస్తోంది.10 నిన్నటి వరకూ సంజయ్ జోషిని సాకుగా చూపి పార్టీ సమావేశాలకు రానంటూ  నరేంద్ర మోడీ హడావుడి చేస్తే, ఇప్పుడు ఏకంగా సీనియర్ నేతలు అడ్వానీ, సుష్మాస్వరాజ్ ముంబై ర్యాలీకి డుమ్మా కొట్టారు. నిత్య ఘర్షణలతో వాడిపోతున్న కమలాన్ని వికసింప చేయడం పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి పెద్ద సవాల్ గా మారుతోంది. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బలప్రదర్శనలా ఏర్పాటు చేస్తున్న ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ, పార్టీ అధ్యక్షుడు గడ్కారీ ఒకే వేదికపై కనపడనున్నారు. అయితే ఈ ర్యాలీకి తాము హాజరు కావడం లేదంటూ అడ్వానీ, సుష్మా సమాచారమందించారు. ముందే అనుకున్న కార్యక్రమాలున్న కారణంగా రాలేకపోతున్నట్లు పార్టీ అధినాయకత్వానికి  తెలిపారు. పైకి ఈ నేతలిద్దరూ వేర్వేరు కారణాలు చెబుతున్నా.. నితిన్ గడ్కరీ రెండోసారి అధ్యక్షుడిగా ఎంపిక కావడం వారికి నచ్చలేదని తెలుస్తోంది.11
    ఆరెస్సెస్ మద్దతుతో గడ్కరీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. పార్టీ నియమావళిలో నిబంధనలను సవరించి ఆ మేరకు ఒక తీర్మానాన్ని కూడా చేశారు. పార్టీ సమావేశం కోసం రెండు రోజుల పాటూ ముంబైలోనే వున్న అద్వానీ పార్టీ  కోర్ కమిటీ తీర్మానం చేసిన సమయంలో మాత్రం లేరు. 2014లో తిరిగి అధికారం దక్కించుకునేందుకు వీలుగా అందరినీ కలుపుకు పోయేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్న ర్యాలీకి హాజరు కాకపోవడాన్ని కొందరు సీనియర్ నేతలే తప్పుబడుతున్నారు. పార్టీలో విభేదాలున్నా ఐక్యతతో ముందుకు సాగాలన్న సందేశం అడ్వానీ లాంటి నేతలే ఇవ్వాలని అలాంటిది ఆయనే ర్యాలీకి గైర్హాజరవడం విచిత్రంగా వుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత 60ఏళ్లుగా బిజెపి రాజకీయ వ్యూహానికి అద్వానీయే కీలకంగా నిలుస్తూ వచ్చారు. పార్టీ నిర్వహించే ఏ సమావేశాలకు ఆయన ఇప్పటి వరకూ డుమ్మా కొట్టలేదు. ఈసారే  అడ్వానీ పార్టీ సమావేశానికి దూరంగా వున్నారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో విరక్తి చెందే ఆయన ర్యాలీకి దూరంగా వున్నారని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Army recruitment rally
Chirranjeevi by elections campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles