Praja shanti party chief ka paul says

praja shanti party chief ka paul says..

praja shanti party chief ka paul says..

21.gif

Posted: 05/27/2012 03:12 PM IST
Praja shanti party chief ka paul says

       జగన్ పార్టీ గల్లంతవుతుందంటున్నాడు పాలన్న.  ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తే వైఎస్సార్సీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెప్పాయని ఆ పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ చెబుతున్నాడు.6 మెదక్  లో ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన ఆయన...జగన్  పై విమర్శలు గుప్పించారు. జగన్ లాగా లక్షల కోట్ల రూపాయల ఆస్తి లేదని, సొంత మీడియా, పేపర్, సొంత గ్యాంగ్, మాఫియా లేదన్నారు. తన అరెస్టుపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కెఎ పాల్ చెప్పారు.
      ఇదిలా ఉంటే.. తన తండ్రి హత్య కేసుతో ఎలాంటి సం బంధం లేదని, పోలీసులు కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని డేవిడ్‌రాజ్ తనయుడు సాల్మన్‌రాజ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గమ్‌సిటీ నిధుల విషయమై డేవిడ్‌రాజ్, కేఏ పాల్‌ల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని చెప్పారు. ఈ క్రమంలో అప్పట్లోనే డేవిడ్‌రాజ్ హత్యకు పాల్ వ్యూహరచన చేసినట్లు తెలిపారు. ఈ విషయాలను పసిగట్టిన డేవిడ్‌రాజ్.. 2009 ఏప్రిల్ 8న తనపై హత్యాయత్నం జరగనుందని, పాల్‌పై అప్పటి డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, హోంమంత్రికి ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు. అయితే, తన తండ్రితో ఉన్న భేదాభిప్రాయాలను సాకుగా చేసుకుని పాల్ ప్రోత్సాహంతో పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని వాపోయారు. మరిన్ని నిజాలు బయటకు రావాలంటే కేఏ. పాల్ సోదరుడు రెడ్డి ఎస్.పాల్‌ను విచారించాలని ఆయన కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharath bandh on 31st of this month
Relief new for andhra pradesh people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles