Nellore tdp candidate opts out

Nellore TDP Candidate Opts Out1

Nellore TDP Candidate Opts Out

Nellore TDP Candidate Opts Out.gif

Posted: 05/25/2012 05:03 PM IST
Nellore tdp candidate opts out

TDP-Partyతెలుగుదేశం పార్టీకి పంచ్ మీద పంచ్ పడుతుంది. నేటి ఉదయం టీడీపీ నేత మైసూరా రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి షాకిస్తే, ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నిక పోటీ నుండి ఆ పార్టీ అభ్యర్థి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి చివరి నిమిషంలో తప్పుకున్నారు. దీంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలినల్లయింది. ఈ విషయాన్ని వేణుగోపాల్ రెడ్డి మాచర్ల ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్ళి స్వయంగా చెప్పాడు.

ఉప ఎన్నికలలో తాను ఖచ్చితంగా పోటీ చేయాలంటే ఒంటేరు రెండు షరతులు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నిధులను తన చేతికే ఇవ్వాలనేది మొదటి షరతు కాగా, తన నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెత్తనం ఉండవద్దని రెండో షరతు బాబు ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. దీంతో అవాక్కయిన చంద్రబాబు అప్పటికి అప్పుడు ఒంటేరుకు కౌంటర్‌గా పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్రతో నామినేషన్ వేయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Married hindu women
Hanumantha rao demands question kvp also in jagans case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles