Two nris jailed for uk visa scam

Indian couple jailed in U.K. for running immigration scam, Two NRIs jailed for UK visa scam,

Indian couple jailed in U.K. for running immigration scam

jailed.gif

Posted: 05/23/2012 11:18 AM IST
Two nris jailed for uk visa scam

బోగస్ కంపెనీలను సృష్టించి, వాటిలో ఉద్యోగాల పేరుతో దేశంలో అక్రమంగా నివసించడానికి తోడ్పడిన ఇద్దరు భారతీయ సంతతి యువకులకు ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఇంగ్లండ్‌లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. పశ్చిమ లండన్‌లోని హౌన్ల్సో ప్రాంతంలో నివసించే సొలిసిటర్ శ్రీనాథ్, కొల్లేటి సంతోష్ అనే యువకులు మూడు బోగస్ కంపెనీలను ప్రారంభించారు. అత్యంత నైపుణ్యం గల ఉద్యోగాలు చేసే వారికి ఇంగ్లండ్‌లో నివసించడానికి సులువుగా వీసా లభిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఆ దేశంలో ఉండాలనుకునే వారికి తమ బోగస్ కంపెనీల్లో ఉద్యోగులుగా గుర్తింపుకార్డులు, వేతన ద్రువపత్రాలు అందజేసేవారు. అయితే.. ఇంగ్లండ్‌లో ఈ కంపెనీ ఉద్యోగుల పేరుతో పెద్ద సంఖ్యలో విదేశీయులు నివసిస్తున్నట్లు గుర్తించిన ఆ దేశ సరిహద్దు ఏజెన్సీ ఆరా తీయడం తో విషయం బయటపడింది. అంతేకాదు.. ఇలా బోగస్ ఉద్యోగుల పేరిట ద్రువపత్రాలు ఇవ్వడానికి దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా శ్రీనాథ్‌కు ఆరున్నరేళ్లు, సంతోష్‌కు నాలుగున్నరేళ్లు జైలుశిక్ష పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother of 5 dies after drinking industrial strength vinegar for a home abortion
Waterloo s janelle tam earns science prize  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles