Up new mango variety named after akhilesh

Akhilesh Yadav, Mango, Akhilesh aam, Haji Kaleemullah Khan, Horticulture

The famous 'dussheri' belt of Uttar Pradesh has a new offering this summer - 'Akhilesh aam', a new variety of mango named after the state's youngest Chief Minister Akhilesh Yadav.

Akhilesh aam.GIF

Posted: 05/02/2012 07:02 PM IST
Up new mango variety named after akhilesh

Akhilesh-Mangoమామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. మార్కెట్లోకి కొత్తరకం మామిడి పండ్లు కొత్త కొత్త పేర్లతో వస్తుంటాయి. వాటిలో బంగినపల్లి మాడిపండ్లు, కోతపరి మాడిమిపండ్లు, రసాలు ఇలా అనేక పేర్లు మీకు తెలిసే ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేరు గల మామిడి పండు మీకు తెలుసా ? ఈ సంవత్సరం మార్కెట్లోకి ఆయన పేరుతో ‘ఓ కొత్త రకం మామిడి పండు’ మార్కెట్లో కి రాబోతుంది.
ఇలాగే గతంలో ప్రముఖల పేర్లతో మార్కెట్ లోకి మామిడి పండ్లు వచ్చాయి. సచిన్ టెండూల్కర్ మామిడి పండు, ఐశ్వర్యరాయ్ మామిడిపండు, సోనియాగాంధీ మామిడి పండు ఇలా అనేక మంది ప్రముఖుల పేరుతో ప్రముఖ హార్టికల్చరిస్ట్ కరీముల్లా కొత్తరకం మామిడిపండ్లను కనిపెట్టాడు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పేరిట కరీముల్లా మరోకొత్త రకం మామిడి పండ్లని మార్కెట్ లోకి వదులుతున్నాడు.

ఈ మామిడి పండ్లకు ఆయన అఖిలేష్ పేరు ఎందుకుపెట్టారట అంటే... సాధారణంగా మామిడి చెట్లు ఐదు సంవత్సరాల వయస్సులో కాయలు కాయవు. కానీ ఆయన కనిపిపెట్టిన చెట్టు వయస్సు 5 సంవత్సరాలే. కానీ ఈ చెట్టు కాయలు కాస్తుండటంతో...వాటికి చిన్న వయస్సులో సీఎం అయిన ‘అఖిలేష్ యాదవ్’ పేరు పెట్టానని కరీముల్లా వివరించాడు. అంతే కాదు ఈ మామిడిపండ్లలో స్పెషాలిటీ కూడా ఉందట. ఈ కాయ యొక్క పండు తొక్క పల్చగా, కండ, రసం తీయగా ఉంటాయని చెప్పాడు. ఇతడు మామిడి మొక్కలకు అంటుకట్టి ఒకే చెట్టుకు వివిధ పరిమాణంలో ఉన్న మామిడి కాయలను 300 రకాల వరకు కాయించాడు. ఇందుకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Getting more sleep at night may help you keep slim
Online examination also for em cet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles