State congress incharge aajad vists ap today

state congress incharge aajad vists ap today

state congress incharge aajad vists ap today

20.gif

Posted: 04/29/2012 03:14 PM IST
State congress incharge aajad vists ap today

       రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్చి గులాం నబీ ఆజాద్‌ ఇవాళ (ఆదివారం)  హైదరాబాద్‌ వచ్చారు.  రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఆజాద్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, పీసీసీ చీఫ్‌ ఇతర ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ajad_and_cm_kiran రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద సెమీ ఫైనల్‌గా అందరూ అభివర్ణిస్తున్న 18 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల సమరంలో పార్టీ అభ్యర్థులను, వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, నేతల మధ్య సమన్వయం సాధించేందుకు కాంగ్రెస్‌ సమన్వయ కమిటీ భేటీ సమావేశమై చర్చించనుంది.
       రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో, పనిలో పనిగా సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే సైతం ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ నుంచి నేపాల్‌ పశుపతి నాథ ఆలయానికి వెళ్లిన నేపధ్యంలో అక్కడినుంచి ఢిల్లీ చేరి, అనంతరం  హైదరాబాద్‌ వచ్చి సకాలంలో సమన్వయ భేటీలో పాల్గొంటారా అనేది తెలియరాలేదు

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  B tech students missing in kakinada beach
Congress leader ponguleti fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles