Pcns finalises preliminary recommendations on us ties

PCNS finalises preliminary recommendations on US ties,Hina Rabbani,World,Pakistan,politics,government,politics (general),Hina Rabbani Khar, Pakistan government, Pakistan politics, Asif Ali Zardari

PCNS finalises preliminary recommendations on US ties.Hina Rabbani

Hina Rabbani.gif

Posted: 04/11/2012 10:23 AM IST
Pcns finalises preliminary recommendations on us ties

Hina Rabbani Khar not to quit, clarifies Pak

అమెరికా విదేశాంగ మంత్రి తదితరుల బృందంతో జరిపిన సమావేశంలో అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో ఒక సందర్భంలో విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ విభేదించడంతో ఆమెకు శాఖమార్పు తప్పదన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆ సమావేశం జరిగిన నాలుగురోజుల అనంతరం ప్రధాన మంత్రి యూసఫ్ రజ గిలానీ చేసిన వ్యాఖ్యలు వీటికి బలాన్ని చేకూర్చాయి.

లాహోర్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విలేఖరులతో గిలానీ మాట్లాడుతూ ‘కాశ్మీర్‌తో సహా భారతదేశంతో ఉన్న అనేక సమస్యలను కొత్త బృందం చర్చల ద్వారా పరిష్కరిస్తుంది’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ‘కొత్త బృందం’ అని ఆయన వినియోగించిన పదంపై అక్కడున్న విలేఖరులు దాని గురించి వివరంగా అడగలేదు, గిలానీ కూడా ఈ వ్యాఖ్యలను విశదీకరించలేదు. లాహోర్‌లో ఈనెల 4న గవర్నర్ హౌస్‌లో అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి థామస్ నైడ్ నాయకత్వాన చర్చలకు వచ్చిన ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి ఖర్ అధ్యక్షుడు జర్దారీ అభిప్రాయాన్ని బాహాటంగా విభేదించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Hina Rabbani Khar not to quit, clarifies Pak

చికాగోలో మేలో అఫ్గనిస్తాన్‌పై జరగనున్న సమావేశంలో పాకిస్తాన్ పాల్గొనడం గురించి నైడ్ ప్రస్తావించగా ‘వాషింగ్టన్ కనుక ఆహ్వానిస్తే దీనిపై ప్రభుత్వం సానుకూలంగా చర్చిస్తుంది’ అని అనగా ఖర్ జోక్యం చేసుకుని ‘పాకిస్తాన్-అమెరికా సంబంధాల గురించి పార్లమెంటు సంయుక్త సమావేశం సమీక్షిస్తోంది. అంతవరకూ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేం’ అని చెప్పినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి. అధ్యక్షుని సమక్షంలోనే ఖర్ ఈ రీతిగా వాదనధోరణితో మాట్లాడడం పట్ల అమెరికా బృందం ఆశ్చర్యపోయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌ రాజకీయాల్లో అందం ఉన్న విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌పై వేటు పడనుందా? అంటే నిజమే అంటున్నాయి అక్కడి ఆంతరంగిక రాజకీయ వర్గాలు. అమెరిక దూతలో జరుగుతున్న ఒక సమావేశంలో అధ్యక్షుడు జర్దారీకి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడమే దీనికి కారణంగా చెబుతున్నారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న జర్దారీ వెంటనే ప్రధాని యూసఫ్‌ గిలానీని కేకేసి ఆమె శాఖ మర్చేయమని చెప్పాడట. గిలానీ అలాగే అన్నాడో లేదో కానీ బయటకు వచ్చి భారత్‌తో సరికొత్త బృందం చర్చలు జరుపుతుంది అనేశాడు. సరికొత్త అనే పదాన్ని నొక్కివక్కాణించాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghuraj pratap singh
No telangana heat for jagan in sangareddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles