Suravaram elected as cpi general secretary

uravaram Sudhakar Reddy, Suravaramsakshitvcom news, sakshitvcom,latest news, ap news

udhakar Reddy to take over as general secretary at party congress this week ... The former MP and deputy general secretary, Suravaram Sudhakar ... polls and last year's Assembly elections in West Bengal and Kerala.

Suravaram Sudhakar Reddy.GIF

Posted: 03/31/2012 03:13 PM IST
Suravaram elected as cpi general secretary

Suravaramభారత కమ్మూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం తరువాత ఓ తెలుగు వాడికి దక్కింది. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర రెడ్డి ఎన్నికయ్యారు. ఎబి బర్దన్ స్థానంలో సురవరం సుధాకర రెడ్డి ఎన్నిక జరిగింది. సిపిఐ జాతీయ మహాసభలు శనివారం పాట్నాలో ముగిశాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర రెడ్డిని ఈ జాతీయ మహాసభలో ఎన్నుకున్నారు. సురవరం సుధాకర రెడ్డి నల్లగొండ నుంచి రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.  సురవరం సుధాకర రెడ్డి 1942 మార్చి 25వ తేదీన మహబూబ్‌నగర్‌లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కర్నూలులో జరిగింది. ఇప్పటి వరకు సుధాకర రెడ్డి సిపిఐ ఉప ప్రధాన కార్యదర్సిగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా కూడా రెండ దఫాలు ఆయన పనిచేశారు. సిపిఐ అనుబంధ సంఘాలు ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008లో హైదరాబాదులో జరిగిన సిపిఐ 20వ జాతీయ మహాసభల్లో ాయన పార్టీ ఉప ప్రధాన కార్యదర్సిగా ఎన్నికై ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఆయన సతీమణి బివి విజయలక్ష్మి బ్యాంక్ అధికారిగా పదవీ విరమణ చేసి, పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayalalithaa revokes sasikala expulsion
Us diplomat pavel in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles