Coal scam involves three of your states

Coal scam involves three of your states,report,mining scam,onourmind

Coal scam involves three of your states

Coal scam.gif

Posted: 03/23/2012 12:32 PM IST
Coal scam involves three of your states

Coal scam involves three of your states

స్ప్రెక్టమ్‌ను మించిన స్థాయిలో దేశ ఖజానాకు పది లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (క్యాగ్) ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. ఉభయ సభల లోపలా, బయటా కూడా విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఈ బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని బిజెపి డిమాండ్ చేసింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రభుత్వం భారీ కుంభకోణానికి ఆస్కారం ఇచ్చేలా వ్యవహరించిందంటూ ప్రతిపక్ష సభ్యులు దుమారం రేపడంతో ఉభయ సభలూ స్తంభించిపోయాయి. లోక్‌సభ సమావేశమైన వెంటనే జెడియూ సభ్యులు క్యాగ్ నివేదికపై చర్చకు పట్టుబట్టారు. 2004-09 సంవత్సరాల మధ్య వంద కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపు అంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజ్యసభలో కూడా ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకున్నాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపివేసి బొగ్గు కుంభకోణంపై చర్చ జరపాలంటూ తాను స్పీకర్‌కు నోటీసు ఇచ్చానని బిజెపి సభ్యులు ప్రకాశ్ జవడేకర్ తెలిపారు. అయితే ప్రశ్నోత్తరాల సమయాన్ని నిలిపివేయడం జరగదంటూ రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ స్పష్టం చేశారు. దాంతో సభ్యులు మరింత తీవ్ర స్థాయిలో బొగ్గు కుంభకోణంపై నినాదాలు చేశారు. ఓ వార్తా పత్రిక కాపీలనూ సభలో ప్రదర్శించారు. సభలో ఎలాంటి వార్తా పత్రికల్ని ప్రదర్శించడానికి వీల్లేదని..ఈ తరహాలో అంశాలను ప్రస్తావించడం సమంజసం కాదని అన్సారీ హితవు చెప్పారు. ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సభలోనే ఉన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన బిజెపి నాయకుడు జవడేకర్ ‘ఇది భారీ కుంభకోణం’ అని వ్యాఖ్యానించారు. కోర్టు పర్యవేక్షణలో ఈ కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వేలం వేయకుండా బొగ్గు గనుల్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన క్యాగ్ నివేదికను ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంట్‌కు సమర్పించాలని సిపిఎం డిమాండ్ చేసింది. వేలం వేయకుండా లైసెన్స్‌లు ఇవ్వడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నించాలని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran under heavy fire over poll defeat
Botsa satyanarayana no resigns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles