Andhra pradesh by election vote counting poll results 2012

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012,By-election in Telangana may spring a surprise ,TRS leads in four constituencies,Telangana Rashtra Samithi, Telegu Desam Party, YSR Congress

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012

Results 2012.gif

Posted: 03/21/2012 12:57 PM IST
Andhra pradesh by election vote counting poll results 2012

Andhra Pradesh By Election Vote Counting Poll Results 2012

రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో అయిదు స్థానాల్లో టిఆర్ఎస్ హవా కొనసాగుతోంది. నాగర్ కర్నూల్‌లో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. కామారెడ్డిలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించగా, టిడిపి డిపాజిట్ గల్లంతయ్యింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకిస్తున్న కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. మహబూబ్ నగర్ లో కౌంటింగ్ ప్రారంభం నుంచి ఉత్కంఠ రేపింది. మొదటి మూడు రౌండ్ల వరకు కాంగ్రెస్ ఆధిక్యం సాధించగా ఏడో రౌండ్ సమయానికి బిజేపి తెరపైకి వచ్చింది. తర్వాత రౌండ్లలో టిఆర్ఎస్ హవా కొనసాగుతోంది. టిఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహీం మోజార్టీ దిశగా విజయం వైపు పయనిస్తున్నారు.

స్టేషన్ ఘన్ పూర్‌లో టిడిపి గట్టిపోటీ ఇస్తుందనుకోగా తెలంగాణ సెంటమెంటు ముందు సైకిల్ బోల్తా కొట్టింది. ఇక కొల్లాపూర్ లోనూ జూపల్లి విజయం వైపుగా దుసుకెళ్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్‌లో టిఆర్ఎస్ అభ్యర్ధి జోగు రామన్న దాదాపు 25 వేల మెజార్టీతో గెలుపు దిశగా ప్రయాణిస్తున్నారు.

ఉపఎన్నికల ఫలితాలు అనుకున్నట్టే వెలువడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాలలోనూ టి.ఆర్.ఎస్. విజయదుందుభి మోగించింది. ఫలితాలు వెలువడుతూనే తెలంగాణ భవన్‌లో సంబరాలు ప్రారంభమయ్యాయి.

By-election in Telangana may spring a surprise

భారతీయ జనతా పార్టీకి చెందిన యెన్నం శ్రీనివాసరెడ్డి మహబూబ్‌నగర్‌లో టి.ఆర్.ఎస్. అభ్యర్థి ఇబ్రహీంను ఓడించారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా చివరివరకూ టి.ఆర్.ఎస్. గెలుపొందుతున్నట్టు కనిపించింది. అయితే గతంలో కె.సి.ఆర్.పై తిరుగుబాటు చేసి ఆ తర్వాత బి.జె.పి.లో చేరిన యెన్నం శ్రీనివాస రెడ్డి చివరి రౌండులో గెలుపొందారు.

నాగర్‌కర్నూల్‌లో ఊహించినట్టే నాగం జనార్దన్ రెడ్డి ఘనవిజయం సాధించారు. మహబూబ్ నగర్‌లో టి.ఆర్.ఎస్.కు చెందిన ఇబ్రహీం గెలుపొందారు. కోవూరులో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్నకుమార్ 23, 246 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagans candidate will win
Consumers internet coffee or a shower  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles