Rnarayana murthys ammakaniki andhra pradesh

RNarayana Murthys Ammakaniki Andhra Pradesh,Revolutionary film maker R. Narayana Murthy, Hero ShiHari, Ammakaniki Andhra Pradesh,

RNarayana Murthys Ammakaniki Andhra Pradesh

RNarayana.gif

Posted: 03/20/2012 07:02 PM IST
Rnarayana murthys ammakaniki andhra pradesh

RNarayana Murthys Ammakaniki Andhra Pradesh

ఎప్పుడు ప్రజల సమస్యలపై పొరాడే సినిమాలు తీస్తూ.. ఒక విప్లవ నాయకుడిగా, హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి, ఆయన చేసే ప్రతి సినిమా ఏదో ఒక సమస్యపైన ఉంటుంది. ఆ సినిమా ద్వార ప్రజలకు చైతన్యం కలిగించాలనేది ఆయన ఆశయం. ఆయన ఇప్పుడు కొత్తగా మరొ సంచలనమైన సినిమా చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం పై సినిమా తీశారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజల సమస్య పై సినిమా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాకు టైటిల్ పెట్టడం కూడా జరిగిందని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ ప్రాంత వాసులు చేపట్టిన పోరాటం ఆధారంగా స్వీయదర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉద్యమం సందర్భంగా జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన జోగారావు పాత్రను శ్రీహరి చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నామని శ్రీకాకుళంలో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీహరి చెప్పారు.

మరిన్ని విశేషాలను ఆయన చెబుతూ -‘‘థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మిస్తే జరిగే పరిణామాలు, పరిశ్రమ వల్ల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు, నష్టాలు తదితర అంశాలను నారాయణమూర్తి కళ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదో సోంపేట ఉద్యమం కూడా అంతే గొప్పది’’ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kancherla keshava rao
Face to face with renuka choudary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles