Telangana state governor

telangana state governor,Minister N Raghuveera Reddy, Rajyashabha, leaders, Chiranjeevi, Renuka chowdary, palyee Govardhan reddy, Jana Reddy, Rapolu, Venkata reddy, ponnala lakshmaiah, Telangana State Governor , CM, Minister DK Aruna

telangana state governor

telangana.gif

Posted: 03/20/2012 05:42 PM IST
Telangana state governor

ఏదో సామెత మాదిరిగా .. ‘‘ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు...సోమలింగం’’ అనేవిధంగా .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందే.. పదవులు వాటా వేసుకుంటున్నారు .. మన రాజకీయనాయకులు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి గవర్నర్ తానేనని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. అసెంబ్లీ లాబీలో.. రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు చిరంజీవి, రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రులు రఘవీరారెడ్డి, జానారెడ్డి, వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మరికొందరు నేతలు అక్కడే ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి, గవర్నర్ ఎవరనేది ప్రస్తావనకువచ్చింది. సీఎంగా పాల్వాయి, జానాల్లో ఒకరికి చాన్సు వస్తుందని అక్కడున్న నేతలు చెప్పారు.

గవర్నర్ ఎవరని అడిగితే ‘రఘువీరారెడ్డే తెలంగాణ మొదటి గవర్నర్’ అని పాల్వాయి చెప్పారు. మిగతా తెలంగాణ నేతలంతా సరే అన్నారు. అనంతరం రఘువీరా బయటకొస్తూ.. మంత్రి డీకే అరుణను చూసి ‘‘అరుణమ్మా....తెలంగాణ వస్తే మొదటి గవర్నర్‌ను నేనే అవుతా. పాల్వాయి ప్రతిపాదిస్తే అక్కడున్న వాళ్లంతా నాకు మద్దతిచ్చారు. మరి నీవేమంటావ్?’’అని అడిగారు. ‘‘అదేంది? తెలంగాణ వ్యక్తికే గవర్నర్ పదవి కావాలని మా వాళ్లు అడగలేదా?’’అని అరుణ చమత్కరించడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb submits status report on liquor raids
Ponnaluri srinivasa gargeya panchangam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles