New railway minister mukul rai take oth tomarrow

new railway minister, mukul rai take oth tomarrow

new railway minister mukul rai take oth tomarrow

28.gif

Posted: 03/19/2012 10:21 PM IST
New railway minister mukul rai take oth tomarrow

           mamataత్రుణముల్ కాంగ్రెస్ అధినేత్రి, దీదీ., పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నంత పనీ చేశారు. తనమాట నెగ్గించుకుని  కేంద్ర రైల్వేశాఖ మంత్రి దినేశ్ త్రివేదిని ఇంటికి సాగనంపారు. ఆయన   రాజీనామాను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆమోదించారు. రైల్వే బడ్జెట్‌లో సామాన్య ప్రయాణీకులపై పెనుభారం మోపడంపై నిరసన వ్యక్తం చేస్తూ తృణమూల్ పార్టీకే చెందిన ఎంపీ దినేశ్ త్రివేదిపై దీదీ రైల్వే బడ్జెట్ అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. dinesh
            ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి పదవికి రాజీనామా సమర్పించాలని త్రివేదిపై మమతా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా,  త్రివేది రాజీనామా పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. ఇవాళ (సోమవారం) ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మమతా బెనర్జీ సమావేశం అనంతరం రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. దాంతో త్రివేది రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.mukul_roy
             ఇదిలా ఉండగా, కొత్త రైల్వే మంత్రిగా రేపు (మంగళవారం) తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ముకుల్‌ రాయ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి గురై దినేష్‌ త్రివేదీ రాజీనామా చేయడంతో ఆమెకు నమ్మకస్తుడైన ముకుల్‌ రాయ్‌ను కొత్త రైల్వే మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈరోజు ప్రధానికి ఆమె తమ అభ్యర్థిని సూచించగా అందుకు ప్రధాని అంగీకరించారు. ప్రస్తుతం ముకుల్‌ రాయ్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi clarifies
Mega star chiranjeevi assets details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles