Deve gowda a race to rashtrapati

Deve Gowda a Race to Rashtrapati

Deve Gowda a Race to Rashtrapati

Deve Gowda a Race to Rashtrapati.GIF

Posted: 03/14/2012 03:46 PM IST
Deve gowda a race to rashtrapati

Deve-gowdaమాజీ ప్రధాని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కు కొత్త కోరికలు పుడుతున్నాయి. ఇటీవలే ఆయనకు 50 సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిలో ఉన్నందుకు గాను ఆయన ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే. ఇక పై రాజకీయాలను నుండి తప్పుకోవాలని అనుకున్నా ఆయన మనసు ఒప్పుకోవడం లేదనుకుంటా... మళ్లీ ఏదో ఒక పదవి చేపట్టాలనే కోరిక ఆయనలో పుట్టినట్లు తెలుస్తుంది. దేవెగౌడ తాజాగా రాష్ట్రపతి పదవి చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
 
కర్ణాటక రాజకీయాలను పూర్తిగా తన పుత్రరత్నాలైన కుమారస్వామి, రేవణ్ణల చేతిలో పెట్టాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో యూపీఏ నేతలతోపాటు కొందరు ఎన్డీయే నేతలతో కూడా దేవెగౌడ సమావేశం కానున్నట్లు సమాచారం.  రాష్ట్రపతి పదవికి దేవెగౌడ పోటీ చేస్తే మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే బహుజన సమాజ పార్టీ, తెలుగుదేశం, వామపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 11 నెలలపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన దేవెగౌడకు జాతీయ స్థాయిలో అనేక పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. తృతీయ కూటమితోపాటు ఎన్డీయే, యూపీఏల్లోని తన మిత్రుల బలంతో రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయనే అంశంపై దేవెగౌడ అంచనా కడుతున్నట్లు తెలిసింది. తన తండ్రి కోరికను తీర్చేందుకు ఇప్పటికే తన కొడుకు కుమారస్వామి రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriramuluclaims having paid rs 250 crore to yeddyurappa
Bombay hc dissolves tainted shirdi trust  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles