Telugu desam party has suffered another t shock

Telugu Desam Party has suffered another T-shock,TDP MLA Nagam Janardhan Reddy , surya venka, lakshmi,Inter, Krishnaveni, by election, nagarkurnool, money, seemaandhra party

Telugu Desam Party has suffered another T-shock

T-shock.gif

Posted: 03/13/2012 10:59 AM IST
Telugu desam party has suffered another t shock

 Telugu Desam Party has suffered another T-shock

ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగం జనార్దన్‌డ్డిని ఓడించడానికి ఏకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేసి పెళ్లిళ్లకు, చావులకు విరాళాల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తోంది. ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఆస్తులైనా అమ్ముకుంటాం, కానీ సీమాంధ్రల డబ్బులు మాకొద్దని ఓ యువతి తెగేసి చెప్పింది. తన పెళ్లికి టీడీపీ నేతలు డబ్బులిస్తారంటే వద్దు అని తోసి పుచ్చింది. తెలకపల్లిలో సూర్య వెంక లక్ష్మి దంపతులు కూలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి ఇంటర్ చదువుకుంది. శ్రీరామనవమి తర్వాత ఆమె పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు.

కాగా ఈనెల 1న నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలు నియోజకవర్గంలో పెళ్లిళ్లు, చావులకు ఓ ట్రస్ట్ పేరుతో విరివిగా విరాళాలు అందిస్తున్నారు. ఇదే క్రమంలో కృష్ణవేణి పెళ్లికి కూడాసదరు పార్టీ నేతలు డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే ముందు వెంక కుటుంబం టీడీపీలో చేరాలని, అప్పుడే డబ్బులు ఇస్తామని రాయబారం పంపారు. దీన్ని ఆ కుటుంబం తిరస్కరించింది. అయితే పెళ్లికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పగా కృష్ణవేణి, సహా కుటుంబ సభ్యులంతా మండిపడ్డారు. సీమాంధ్ర పార్టీల డబ్బుతో పెళ్లి చేసుకొని తానెలా సుఖ పడతానని ఆ యువతి డబ్బులు తీసుకోనని తెగేసి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy fired at cm kiran kumar reddy t
Sc issued notice to 6 ap ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles