Dl ravindra reddy sensational comments

dl ravindra reddy sensational comments.breaking news, world news, news, current news,sports news, entertainment news

dl ravindra reddy sensational comments.breaking news, world news, news, current news,sports news, entertainment news

dl ravindra reddy sensational comments.gif

Posted: 03/07/2012 09:09 PM IST
Dl ravindra reddy sensational comments

DL.-Ravidra-reddyరాజకీయ నాయకులు ఎంతలో ఎంత మారిపోతారనడానికి ప్రత్యక్ష ఉదాహరణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డి అని చెప్పవచ్చు.కొంతకాలం క్రితం వై.ఎస్.జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన రవీంద్ర రెడ్డి ఇప్పుడు జగన్ కు అనుకూలమైన ప్రకటనలు చేయడంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన ఒక ప్రకటన కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పదిహేడు ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డెబ్బైమంది జగన్ పక్షాన చేరతారని శాసనసభ లాబీలలో చెప్పారు.

పైగా గత కడప ఉప ఎన్నికల సమయంలో ఒక వర్గం మీడియా తమను తప్పుదారి పట్టించిందని కూడా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విబేదాలు వచ్చాక ఆయన శాసనసభకు కూడా సరిగా రావడం లేదు. ఇప్పుడు జగన్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. జగన్ పై హైకోర్టుకు లేఖ రాసిన మాజీ మంత్రి శంకరరావు, డి.ఎల్. రవీంద్ర రెడ్డిలు ఇద్దరూ ముఖ్యమంత్రి కి దూరం అవడం ఒక పరిణామం అయితే వారిద్దరూ ఇప్పుడు జగన్ కు సానుభూతిగా మాట్లాడడం మరో ఆసక్తికర పరిణామం.డి.ఎల్. అల్లుడు కూడా అయిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడికి ప్రకాశం జిల్లా పర్చూరు టిక్కెట్ జగన్ పార్టీ తరపున ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో డి.ఎల్. లో ఈ మార్పు వచ్చిందా అన్న ప్రశ్న రాజకీయవర్గాలలో వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jc diwakar reddy comments on rahul
Tata motors to come up with 100kmltr mileage car read more at httpindiatodayintodayinstorytata motors 100 km per litre car megapixel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles