Rape victim fights back

rape victim fights back,alcohol,crime,date rape,date rape drugs,ghb,illicit drugs,katamine,rape,rapists,rohypnol,safety,self defense,sex predators,sexual attack,sexual offence,sexual violence,women

rape victim fights back

rape.gif

Posted: 03/02/2012 10:24 AM IST
Rape victim fights back

rape victim fights back

ఇప్పటిదాకా అత్యాచారాల విషయంలో ఢిల్లీదే రికార్డు అనుకుంటుంటే.. లాస్ ఏంజెలీస్, న్యూయార్క్ పరిస్థితి మరీ దారుణమని తేలింది. 2007 జాతీయ నేరాల రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం (తాజాగా అందుబాటులో ఉన్నవి ఇవే) ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో రోజుకు ప్రతి లక్ష మంది మహిళల్లో సగటున 3.57% గురవుతున్నారు. కానీ.. అమెరికాలోని ప్రఖ్యాత వాణిజ్య కేంద్రం న్యూయార్క్‌లో ప్రతి లక్ష మంది మహిళలకు గాను 10% మంది ఈ లైంగిక దోపిడీబారిన పడుతున్నారని ఎఫ్‌బీఐ, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ లెక్కలు పేర్కొంటున్నాయి. లాస్ ఏంజెలీస్ వంటి ఇతర దేశాల మెట్రో నగరాలతో పోల్చితే భారతదేశంలోని మెట్రో నగరాల్లో నివసించే మహిళలు ఎంతో భద్రంగా ఉన్నట్లు లెక్క! అది కూడా పోలీసు భద్రత, ఆడాళ్లంటే చొంగకార్చుకునే మగానుభావులు, మహిళలను లైంగిక దోపిడీకి సులువైన టార్గెట్‌గా భావించే దుర్మార్గులు ఉన్నప్పటికీ..!!

rape victim fights back

లాస్ ఏంజెలీస్ పరిస్థితి మరీ ఘోరమనే చెప్పాలి. అక్కడ 2006 లెక్కల ప్రకారం చూస్తే రోజూ ప్రతి లక్ష మంది మహిళల్లో 27 మంది రోజూ అత్యాచారాలకు గురవుతున్నారు. 2010లో బ్రిటిష్ క్రైమ్ రికార్డ్ సర్వే నివేదికను ఆ దేశ హోం శాఖ విడుదల చేసింది. పదహారేళ్ల పైబడిన బ్రిటిష్ యువతులు, మహిళల్లో 4.2 శాతం మంది తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా అత్యాచారానికి గురికావడమో, లేదా వారిపై అత్యాచారానికి ప్రయత్నమో జరిగింది. బెల్జియంలో 200 లెక్కల ప్రకారం రోజూ ప్రతి లక్ష మందిలో 29.5 శాతం మంది అత్యాచారానికి గురవుతున్నారు. ఫ్రాన్స్ విషయంలో అది 16.4 శాతంగా ఉంది. కోల్‌కతాలో 37 ఏళ్ల తల్లిపైన, నోయిడాలో 17 ఏళ్ల బాలికపైన జరిగిన సామూహిక అత్యాచారాలు దేశాన్ని కుదిపివేశాయి. ఒడిశాలోని పీప్లీ గ్రామంలో జరిగిన అత్యాచారం, ఇటీవలే బెంగాల్‌లో జరిగిన అత్యాచారాలు తీవ్ర కలవరాన్ని కల్గించాయి.

సున్నితంగా స్పందింపచేస్తున్నాయి. కానీ.. కొంతకాలానికి ఈ సున్నితత్వం బండబారిపోతున్నది. ఇవి సాధారణ నేరాలన్న ధోరణి పెరిగిపోతున్నది. అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు ఈ కేసులలో విచారణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కేసులలో తీర్పులు రాకముందే, నేర నిరూపణ జరగకముందే చేస్తున్న వ్యాఖ్యానాలు మరింత బండబారేలా చేస్తున్నాయి. మహిళలపై నేరాలు, ప్రత్యేకించి లైంగిక దాడులు ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి పెద్ద సమస్యగా తయారయ్యాయి. అదే సమయంలో మహిళల విషయంలో కొన్ని పొరపాటు అవగాహనలు కూడా ఉన్నాయి. న్యూయార్క్ విషయాన్నే తీసుకుంటే ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో మహిళలు ఎక్కువగా ఉంటారన్నది ఇందులో ఒకటి. కానీ.. ఇది పాక్షిక సత్యమే. ప్రతి పెద్ద నగరంలోను, ప్రత్యేకించి పెద్దగా ఆర్థికంగా స్థితిమంతులు కాని మహిళలు సాయంత్రం తమ కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ప్రజా రవాణాను ఉపయోగిస్తారు.

rape victim fights back

వారి ఆర్థిక పరిస్థితి కారణంగా తమ కార్యాలయ సమయాలను సొంతంగా నిర్దేశించుకునే అవకాశం వారికి ఉండదు. నిజానికి లాస్ ఏంజెలీస్‌లో అత్యధిక అత్యాచారాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో ప్రజా రవాణాను ఉపయోగించుకునేవారే అధికంగా అత్యాచారాలకు గురవుతుండటం గమనార్హం. భారతదేశంలో అత్యాచారాలు అనేవి చాలా వరకూ నమోదు కావడం లేదన్నది కఠోర సత్యం. అమెరికాలోనూ అంతే. మరో విషయం ఏమంటే.. అత్యాచారాలకు పాల్పడినవారు కుటుంబ సభ్యుల్లో ఒకరై ఉంటుండటం. దీనితో చాలా కేసులు ఫిర్యాదుల దాకా వెళ్లడం లేదని వివిధ సర్వే గణాంకాలు పేర్కొంటున్నాయి. భారతదేశంలో అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడే శాతం చాలా స్వల్పంగా ఉంటున్నది. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. 2007 లెక్కల ప్రకారం కేవలం ఆరు శాతం మంది దోషులకు మాత్రమే లండన్ నగరంలో శిక్షలు పడ్డాయి. అత్యాచారం కేసుల విషయంలో మీడియా పాత్ర కూడా భారతదేశంలో చర్చనీయాంశం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police constable suspended in journalist beaten up incident
Authorities fall heavy now on traffic violators  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles