అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యాటకులను అలరించటానికి స్థానిక జాడ్వా జాతి గిరిజన యువతులచేత అర్ధ నగ్నంగా నృత్య ప్రదర్శన చేయించిన కేసులో పోలీస్ కాన్ స్టేబుల్ సిల్వేరియస్ కిండో అరెస్టయ్యాడు.
ఎంతో కాలంగా ఈ తంతు జరుగుతున్నా స్థానిక అధికారులకు, పోలీసులకు ఈ సంగతి తెలియరాలేదు. విదేశీయుడు వెబ్ లో పెట్టిన వీడియో చూసి ఉలిక్కిపడి విచారణ కొనసాగిస్తే కాన్ స్టేబుల్ దొరికాడు. ఫిబ్రవరి 5 న యుకె వెబ్ సైట్ లో పెట్టిన ఈ వీడియోని పరిశీలిస్తే, 2007 వ సంవత్సరంలో జూలై, నవంబరు మధ్య చిత్రీకరించినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో తెలుస్తోంది.
వీడియో లో ఒక ఖాకీ యూనిఫాం కనిపించింది. దానితో, ఆదిమ జనజాతి వికాసద్ సమితి సభ్యుల సహాయంతో కెమేరా ముందు నగ్నంగా నృత్యం చెయ్యమని చెప్పిందెవరు అని విచారించి గుర్తుపట్టటానికి పరేడ్ నిర్వహించగా కాన్ స్టేబుల్ కిండో దొరికిపోయాడు. అలాంటి వీడియో మరొకటి 2008 సెప్టెంబర్ లో చిత్రీకరించింది కూడా దొరికింది.
ఈ నేరాన్ని ఎస్ సి ఎస్ టి అట్రాసిటీస్ చట్టం కింద, ఆదివాసుల పరిరక్షణా చట్టం కిందా చర్య తీసుకోవటానికి అధికారులు కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more