Swedish man trapped in car for two months

Swedish Man Trapped in Car for Two Months,Swedish man stranded car 2 months, ice, snow,sweden,swedish,trapped,europe

Swedish Man Trapped in Car for Two Months

Swedish.gif

Posted: 02/20/2012 03:23 PM IST
Swedish man trapped in car for two months

Swedish Man Trapped in Car for Two Months

ఆహారం లేదు. నీళ్లు లేవు. బయటకు వెళ్లేందుకు దారీ లేదు. ఇలా రెండునెలల పాటు స్వీడన్‌లోని 45 ఏళ్ల వ్యక్తి ఒకరు తన కారుసహా మంచుగడ్డల్లో కూరుకుపోయాడు. ఉత్తర స్వీడన్‌లోని ఉమియా నగరానికి దగ్గరలో ఉన్న అడవిబాటలో కూరుకుపోయిన ఆయన్ని పోలీసులు రక్షించారు. స్నోమొబైలర్స్ మొదట అక్కడ కారు కూరుకుపోయిందని భావించారు. అయితే, దాన్ని పగలగొట్టడంతో స్లీపింగ్‌బ్యాగ్‌లో మూలుగుతున్న సదరు వ్యక్తి కనిపించాడు. బక్కచిక్కి మాట్లాడలేని స్థితిలో ఉన్న అతణ్ని ఉమియా యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. 

తాను డిసెంబర్ 19న మంచులో కూరుకుపొయినట్లు మాత్రమే అతను చెప్పగలిగాడు. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. "మామూలుగా నాలుగు వారాలపాటు ఆహారం లేకుంటే మనుషులు బతకలేరు. అయితే, ఈ వ్యక్తి సుప్తావస్థ(హైబర్నేషన్)లోకి వెళ్లాడు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. ముఖ్యంగా కప్పలు, ఎలుగుబంట్లులాంటి వాటిలో ఈ పరిస్థితి ఉంటుంది'' అని వైద్యుడు స్టీఫెన్ బ్రాంత్ చెప్పారు. అయితే, అతనలా మంచులో కూరుకుపోవడానికి గల కారణాలు తెలియ లేదని ఉమియా పోలీసు అధికారి ఎబ్బే నైబర్గ్ తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drinking water
Pg college  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles