Veerasivareddy

veera_siva_reddy,Congress MLA from Kadapa district Veera Siva Reddy,Congress Mla G Veera Siva Reddy, Photos - Congress Mla G Veera Siva Reddy, Videos - Congress Mla G Veera Siva Reddy

veera_siva_reddy

veera_.gif

Posted: 02/20/2012 03:05 PM IST
Veerasivareddy

veera_siva_reddyఅధికారంలో ఉన్న వాళ్లు తలచుకుంటే ఏమైనా చేయవచ్చని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి నిరూపించారు. రూ.కోటి విలువైన స్థలం, భవనాన్ని లక్షకే కొట్టేశారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గతం లో వీరశివారెడ్డి లెసైన్స్‌డ్ ఏజెంట్‌గా వ్యవహరించేవా రు. 1971లో మార్కెట్‌యార్డులో ఉన్న స్థలాన్ని ఏజెం ట్లకు అప్పగించేందుకు బహిరంగ వేలం నిర్వహించా రు. స్థలం కొనుగోలు చేసిన మెత్తం 49మంది కమీషన్ ఏజంట్లలో 38 మంది డబ్బు మొత్తాన్ని చెల్లించి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోగా, డబ్బు చెల్లించని కారణంగా 11మందికి స్థలాలు రిజిస్ట్రేషన్ కాలేదు. వీరిలో ప్లాటు నంబర్ 31 హక్కుదారుడు వీరశివా కూడా ఉన్నారు.

తదనంతర కాలంలో ఈ యార్డులో కమీషన్ ఏజంట్లు తమ వ్యాపారాన్ని వదిలేశారు. దీంతో, ఇక ఆ 11మందిలో ఎవరికీ అధికారులు స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించలేదు. అయితే, వీరశివారెడ్డి మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు తన పలుకుబడితో మార్కెటింగ్ శాఖ నుంచి స్థలం రిజిస్ట్రేషన్ కోసం అనుమతి తెచ్చుకున్నారు. 4.82 సెంట్ల స్థలాన్ని అప్పటి కమీషన్ ఏజెంట్లు రూ.3150కి కొనుగోలు చేయగా, ఇప్పుడు కూడా అదే ధరతో స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో మార్కెట్ కమిటీ నిర్మించిన భవనానికి కూడా ప్రభుత్వ అంచనా ప్రకారం మరో రూ.63,375లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ అంచనా ప్రకారం స్థలంతో పాటు భవనం విలువ కలిపి దాదాపు రూ.కోటి ఉండగా, వీరశివారెడ్డి లక్ష లోపు విలువ కట్టిదక్కించుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pg college
Chiranjeevi marriage day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles