Liquor kingpin surrenders

Liquor kingpin surrenders, Kothapalli Balasubrahmanyam, Godavari district, Balu of Devasai Wines, surrendered to the ACB police on Thursday

Liquor kingpin surrenders

Baalu.gif

Posted: 02/17/2012 11:54 AM IST
Liquor kingpin surrenders

Baaluఈ మద్యం సిండికేట్‌కు సూత్రధారిగా వ్యవహరిస్తున్న కొత్తపల్లి బాలసువూబహ్మణ్యం అలియాస్ బాలు ఏసీబీ అధికారులకు స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఎవవరికి ఎంతెంత మామూళ్లు ఇచ్చింది తెలిపిన ముళ్లపూడి శ్రీనివాస్ ఇతని వద్దనే పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన తరువాత ఏసీబీ అధికారులు బాలు కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఇన్నాళ్లు అతను ఏసీబీ అధికారుల చేతికి చిక్కకుండా తిరిగాడు. రాజమంవూడిలోని ఏసీబీ డీఎస్‌పీ కార్యాలయానికి వచ్చిన బాలు తాను లొంగిపోతున్నట్టు అధికారులకు చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారులు అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం ఇన్నీసుపేటలోని బాలు ఇంట్లో తనిఖీలు చేశారు.
బ్యాంక్ లావాదేవీల పత్రాలతోపాటు ఆదాయంపన్ను చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాలుపై లంచం ఇవ్వటం, గరిష్ఠ చిల్లర ధర నిబంధనను ఉల్లంఘించాడన్న నేరారోపణల మీద కేసులు నమోదు చేశారు. బాలు వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును ముందుకు నడిపిస్తామని ఏసీబీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ మీడియాతో చెప్పారు. బాలు సూత్రధారిగా వ్యవహరిస్తున్న సిండికేట్‌లోని పదమూడు మద్యం షాపుల్లో ఎవవరు భాగస్వాములుగా ఉన్నారన్న విషయమై విచారణ చేస్తామన్నారు. బాలును ఏసీబీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి మెజివూస్టేట్ ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blind becomes ias
Relation with italy still in strain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles