Relationship reasons for divorce

Relationship Reasons for Divorce ,Marriages matrimonials ads, profiles, pictures, match makting, finding spouse, on Indian family, sexuality, marriage, love and intimate life of its people family

Relationship Reasons for Divorce

Divorce.gif

Posted: 02/16/2012 10:17 AM IST
Relationship reasons for divorce

Relationship Reasons for Divorce

ఒకప్పుడు విడాకులనేమాట ఎక్కడోగానీ వినిపించేది కాదు. అందుకు కారణాలు కూడా సబబుగానే అనిపించేవి, ఏ మందులకీ లొంగని రోగాలో, భరించలేని హింస, విపరీతంగా తాగి, దుర్మార్గంగా ఇల్లాలిని తన్ని తగలేసే భర్త.. ఇలా కొన్ని కారణాలవల్ల విడాకులు పెరిగాయి. ఆలుమగల మధ్య అహంకారాలు, పట్టుదలలు, అంతస్థుల తేడాలు పెరిగి విడాకుల సంఖ్య పెరిగితే, కొన్ని కొన్నిచోట్ల అక్రమ సంబంధాలవల్ల విడాకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొన్నీ మధ్యే నా స్నేహితురాలు ఉజ్వల ఒక వింత కారణం చెప్పింది. అది వింటే నాకెంత ఆశ్చర్యం కలిగిందో చెప్పలేను. బహుశా మీకూ అలాగే అనిపించొచ్చు. ఉజ్వల ఒక దూరపు చుట్టం అమల  వుందట. ఆవిడ అదే.. అమలగారు కూడా బాగా ఉన్నత విద్యనభ్యసించి, మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నావిడేనట. కొడుకు పదేళ్ళ వయసులో వున్నప్పుడే ఆమె భర్త పోయాడట. కష్టపడి కొడుకుని బాగా చదివించి వాడి ఇష్టప్రకారమే, అతడు బిజినెస్ చేసుకుంటానంటే సరేనందిట. వాడు చాలా బుద్ధిమంతుడట.

వాడికి ఒక సంవత్సరం క్రితం పెళ్లిచేశారట. ఆర్నెల్లు ఎలా గడిచాయో ఏమో, మరో ఆర్నెల్ల నుంచీ ఇంట్లో రోజూ ఏదో గొడవేనట వాళ్ల మధ్య. ఆవిడ పాపం దిగులుగా కారణాలేమిటో తెలుసుకుని సమస్య పరిష్కరిద్దామని చూస్తే, కొడుకూ కోడలూ ఇద్దరూ కారణాలు చెప్పడంలేదట. పుట్టింటికి వెళ్లిన కోడలి నుంచి ఒక రోజున తనకు అందిన లాయరు నోటీసు చూసి కొడుకును గట్టిగా నిలదీసిందట ఆమె. కొడుకు తలదించుకుని ఎటో చూస్తూ చెప్పిన మాటలు విని నోరు తెరిచిందట ఆమె. కారణాలు ఇవి- నువ్వు తాగవెందుకు? పేకాట ఆడవు, కబ్బులకెళ్ళవు. ఇతర స్ర్తిలతో తిరగవు. మా నాన్నా, మా బాబాయిలందరూ ఇవన్నీ చేస్తారు. అది సోషల్ స్టేటస్. స్టేటస్ సింబల్. నీకెంతసేపూ ఇల్లూ, నీ ఆఫీసు, మీ అమ్మా, నేనూ, ఛీ ఛీ.. ఈ కారణాలు, రోజురోజుకీ పోరులా తయారై చులకనగా మాట్లాడడం, ఈసడింపులూ, వెక్కిరింపులూ ఇలా దినదినాభివృద్ధి చెందుతూ, చివరగా పుట్టింటికెళ్లిపోయి విడాకుల నోటీసు పంపించింది. ‘నా భర్త చాతకానివాడు, తెలివి తక్కువవాడు, సంసారం మీద మోజులేనివాడు’ అని నోటీసులో కారణాలు చూపించిందట.

ఆ కేసు ఇప్పుడు కోర్టులో వుందిట. ఉజ్వల చెప్తూ వుంటే, జనం ఇలా క్కూడా వుంటారా? అని నేను ఆశ్చర్యంతో నోరు తెరిచాను. అప్పుడు నాకు మావొదిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నలభై ఏళ్ళ క్రితం, మా వొదినంటే మా పెదనాన్నగారి కోడలు- ‘మా ఆయన ఒట్టి పప్పుముద్ద. ఒక సిగరెట్ అయినా తాగరు. హోటల్‌కెళదామంటే, ఇంక హైజీన్ గురించి, హోటల్లో తింటే వొచ్చే రోగాల గురించి ఒక గంట ఉపన్యాసం ఇస్తారు. ఆయన ఎంత డాక్టరైనా, అందరు డాక్టర్లూ ఇలాగే వుంటారా? వున్నారా? హోటళ్లలో తినడం లేదూ? ఈయనో ఛాదస్తపు మనిషి అంటూ చెప్పేది. ఏది లేదో అది కావాలని మోజు పడడం సహజమా ? అనిపించింది. ఇప్పుడు మా వొదిన మా అన్నయ్యను ఎంత పొగుడుతుందో? అతడు పోయాడు. తన అన్నదమ్ముల్లో ఒకడు పేకాట రాయుడు, మరొకడు మధ్యరాత్రివరకూ తాగుతూ కొంపని కొల్లేరు చేసే వాడూ తిరుగుబోతూనూ. వాళ్లని చూళ్లేక ఏమీ చెయ్యలేక, మా అన్నయ్యని రోజుకొక్కసారైన తల్చుకుని బాధపడుతూ వుంటుంది, ఆవిడ తమ్ముళ్ల గురించి. ఆ మాటే ఉజ్వలతో అన్నాను.

‘అవునే. కాలం ఎంతగా మారిపోయిందంటే అలా అనుకుని ఊరుకోవడం లేదు ఈనాటి ఆడపిల్లలు, బహుశా మగపిల్లలుకూడా. చీటికీ, మాటికీ కోర్టుకెళ్లిపోతున్నారు. పెళ్లిళ్లు చెయ్యాలంటే భయపడుతున్నారు ఈనాటి పెద్దలు అంది బాధగా! ఇది ప్రపంచీకరణం కల్పించిన ధైర్యం. మనకి ఆ కాలంలో కొన్ని నీతులు, సూత్రాలూవుండేవి. ఆ పునాదులెప్పుడైతే కదిలిపోయాయో, ఇంకా విపరీత ధోరణుల్లో కదిలిపోతున్నాయో, విలువలు పడిపోతున్నాయి. మానసిక సంఘర్షణలు పెరిగి, డబ్బులు దండిగా వున్నా సంతోషం కరువైపోతోంది’’ అన్నాను కాఫీ కలుపుకొచ్చి, ఒక కప్పు ఉజ్వలకిస్తూ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr performing chandi yagam for telangana
Anam ramanarayana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles