Now indian railways is on facebook

Now Indian Railways is on Facebook,social networking site Facebook where passengers can check out availability of berths, train timings and other related information.

Now Indian Railways is on Facebook

Facebook1.gif

Posted: 02/14/2012 05:02 PM IST
Now indian railways is on facebook

Now Indian Railways is on Facebook

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ పరిధి మరింత విస్తృతమైంది. ఇకపై దాని లో రైళ్ల సమయాలు, బెర్తుల అందుబాటు తదితర అం శాలనూ తెలుసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖలోని ఢి ల్లీ డివిజన్ ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా ఓ పేజీని తెరిచింది. రైళ్ల రాకపోకలు, బెర్తుల అందుబాటు తదితర వివరాలను ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ఫేస్‌బుక్‌లో ఓ పేజీని తెరిచామని, దీనిని నేషనల్ ట్రైన్ ఇంక్వైరీ సర్వీస్‌తో లింక్ చేస్తున్నామని, ఎప్పటికప్పుడు దీనిని అప్‌డేట్ చేస్తామని ఢిల్లీ డివిజన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

అలాగే, న్యూ ఢిల్లీ, నిజాముద్దీన్, ఓల్డ్ ఢిల్లీ స్టేషన్లకు ఏయే రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనే వివరాలు కూడా ఇందులో ఉంటాయని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్లను ‘అసాంఘిక శక్తులు’ దుర్వినియోగం చేయకుండా నిరోధించడమే దీని ధ్యేయమన్నారు. ఇటువంటి సృజనాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని, ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విస్తృ త ప్రచారం కల్పించాలని ఇతర డివిజన్లకు రైల్వే శాఖ సూచించింది.

ఈ సౌకర్యంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నదే తమ ధ్యేయమని, దీనికి ప్రచారం లేకపోవడంతో అసాంఘిక శక్తులు దీనిని దుర్వినియోగం చేస్తున్నాయని వివరించారు. అంతేనా.. అత్యవసరంగా ప్రయాణించాల్సిన సమయాల్లో రైలు బయలుదేరే స్టేషన్లోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రిజర్వేషన్ చార్టు తయారైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను రైలు బయలుదేరడానికి ముందే.. ఆయా స్టేషన్లలోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Microsoft indias retail website hacked
Steve jobs receives special merit award at the grammys  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles