Newsreader commits suicide

Newsreader commits suicide, Sabyasachi Patnaik,lungi Vanasthalipuram sub-inspector

Newsreader commits suicide

Newsreader.gif

Posted: 02/13/2012 04:18 PM IST
Newsreader commits suicide

పని వత్తిడి మూలంగా టివి న్యూస్‌ రీడిర్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిదిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి ఎసై్స వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం...ఒడిషా రాష్ట్రానికి చెందిన సత్యసచిపట్నాయక్‌ (27) ఈనెల 5వ తేదీన నగరానికి వచ్చి నగర శివారులోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒడిషా చానల్‌లో న్యూస్‌ రీడిర్‌గా ఉద్యోగంలో చేరాడు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ద్వారకామయినగర్‌లో మరో ఇద్దరు మిత్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వారం రోజులు విధులకు వెళ్లి వచ్చిన పట్నాయక్‌ విధుల నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
బయటికి వెల్లి రాత్రి ఇంటికి వచ్చిన పట్నాయక్‌ రూమ్‌లోని మిత్రులు లోపటి నుంచి గడియ పెట్టి ఉండడం గమనించి పిలిచినా పలకకపోవడంతో ఇంటి యజమానిని పిలిచారు. అనుమానం వచ్చిన యజమానికి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగుల గొట్టి ఫ్యాన్‌కు వేలాడి ఉన్న పట్నాయక్‌ మృతదేహాన్ని దించి పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎసై్స వెంకటనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను చనిపోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. అతను ప్రేమలో విఫలంల అయ్యాడని కొందరు ప్రజలు అంటున్నారు. మరికొందరు .. ఎవరో అతన్ని చంపి ఊరి వేశారని అంటున్నారు. అయితే అతని స్నేహితులు మాత్రం .. ఈ మద్య కాలంలో .. యాజమాన్యంతో గోడవలు జరిగాయాని అంటున్నారు. ఏదీ నిజమో, ఏదీ అబద్దమో తెలియాక పోలీసులు దర్యాప్తు చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kapunadu meeting
Estranged wife can live in husbands house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles