Assembly budjet session starts today onwards

assembly budjet, session starts, today onwards,

assembly budjet session starts today onwards

6.gif

Posted: 02/13/2012 12:39 PM IST
Assembly budjet session starts today onwards

assemblyశాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 .30 గంటలకు పాత అసెంబ్లీ హాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. టీఆర్ఎస్, టీడీపీ నిరసనతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నుంచి వాకౌట్ చేశాయి. మొదట గవర్నర్‌ హడావుడిగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. సభ నుంచి విపక్ష సభ్యులు వెళ్లిపోయాక'రిలాక్స్డ్‌' గా ప్రసంగాన్ని వినిపించారు.

governorప్రభుత్వ ప్రాధాన్యతల్ని గవర్నర్‌ తన 35 నిమిషాల ప్రసంగంలో చాటిచెప్పారు. జనగణమన పూర్తయ్యాక వెంటనే సభలో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. గవర్నర్‌ ప్రసంగం పత్రాల్ని విపక్ష సభ్యులు చించేశారు. వాటిని గవర్నర్‌పైకి విసిరే ప్రయత్నం చేశారు. చుట్టు నిలిచిన సెక్యూరిటీ సిబ్బంది ఆ కాగితాలు గవర్నర్‌పై పడకుండా పట్టుకున్నారు. కాగా గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి....తెలుగులోనే ముగించారు.


         కాగా, గవర్నర్‌ ప్రసంగం మీద టీడీపీతో పాటు విపక్షాలన్నీ మండిపడ్డయి. సొంత డబ్బాకొట్టుకున్నట్టుందని వామపక్షాలు, జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆరోపించారు. విభజన అంశం లేదంటూ టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది.

speakerఅనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాగా ఈ సమావేశానికి టీడీపీ గైర్హాజరు అయ్యింది. బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో సభలో ఏయే అంశాలపై చర్చించాలనే వాటిపై బీఏసీలో ఖరారు చేశారు. ఈనెల 17న ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మార్చి నెలాఖరు వరకు ఈ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతాయి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Feb 14 to be celebrated as parents day in chhattisgarh
Brain not the heart drives you to fall in love  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles